బిగ్ బాస్ - ఇదేం పిచ్చిరా అయ్యా
SI Requests Entry Into Bigg Boss 10
బిగ్ బాస్ అంటే ఒకప్పుడు చాలా క్రేజ్ ఉండేది. బిగ్ బాస్ లోకి వెళితే ఫేమస్ అవ్వొచ్చని కొందరు, క్రేజ్ సంపాదించొచ్చు అని మరికొందరు, బిగ్ బాస్ కి వెళితే సినిమా అవకాశాలొస్తాయని ఇంకొందరు, బిగ్ బాస్ ద్వారా అత్యధిక రెమ్యునరేషన్ అందుకోవచ్చని కొందరు ఆశపడి హౌస్ లోకి వెళితే అక్కడ హౌస్ లో ఫిజికల్, మెంటల్ టాస్క్ లు, ఇంకా మిగతా విషయాల వల్ల వారి వారి వ్యక్తిగత జీవితం ట్రోల్స్ కి గురవుతుంది.
అందుకే ఈ మద్యన సెలెబ్రిటీ హోదా వున్న వాళ్లలో చాలామంది బిగ్ బాస్ కి వెళ్లాలి అంటే వెనకాముందు ఆడుతున్నారు. కానీ కామన్ మ్యాన్స్ లో చాలామంది హౌస్ లోకి వెళ్ళడానికి ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు. గత సీజన్ కు కామన్ మ్యాన్ ని తీసుకునేందుకు అగ్నిపరిక్ష పెడితే బాగానే ఆదరణ వచ్చింది. కానీ ఈ ఏడాది ఈ సీజన్ కి అగ్నిపరీక్షకు ఆదరణ కరువైంది.
ఇప్పుడొక ప్రభుత్వ ఉద్యోగి బిగ్ బాస్ కి వెళ్ళాలి, మా ఫ్యామిలీ కోరిక అది, నా పిల్లలు నన్ను బిగ్ బాస్ హౌస్ లో చూడాలనుకుంటున్నారు అంటున్నారు. అతనెవరో కాదు ఓ పోలీస్. నాగార్జున గారూ.. ఒక్క ఛాన్స్ ప్లీజ్ అంటున్న ఓ ఎస్సై అడగడం హాట్ టాపిక్ అయ్యింది.
బిగ్ బాస్ సీజన్ 10 లో తనకు అవకాశం ఇవ్వాలంటూ సెల్ఫ్ వీడియో ద్వారా నాగార్జునను, స్టార్ మా ను ఆ ఎస్సై అభ్యర్దిస్తున్నాడు.
నంద్యాల జిల్లా గడివేముల పోలీస్ స్టేషన్ లో ఎస్సై గా పనిచేస్తున్న నాగార్జున రెడ్డి.. అవకాశం ఇస్తే బిగ్ బాస్ హౌజ్ లో పెర్ఫార్మెన్స్ అదరగొడ్తనంటున్నాడు. తనను తన పిల్లలు బిగ్ బాస్ హౌస్ లో చూడాలనుకుంటున్నారు, తన పిల్లల కోరిక తీర్చాలనుందంటున్న ఎస్సై నాగార్జున కోరిక తీరుతుందేమో చూడాలి.







































