ప్రెగ్నెన్సీ ని అనౌన్స్ చేసిన సమంత

Samantha confirms pregnancy

 

హీరోయిన్ సమంత ప్రెగ్నెంట్ అంటూ ఆ నోటా, ఈ నోటా వినడం, మా ఇంటి బంగారం సక్సెస్ సెలెబ్రేషన్స్ సమంత బేబీ బంప్ తో కనిపించడం, తర్వాత దర్శకురాలు నందిని రెడ్డి తన సినిమా సక్సెస్ టైమ్ లో సమంత ప్రెగ్నెంట్ విషయం తెలియడం హ్యాపీ అని, మెగాస్టార్ చిరు సమంత-రాజ్ నిడిమోరు దంపతులు కొత్త అధ్యయనానికి వెల్ కమ్ చెబుతున్నారని సారె పెట్టడం తప్ప సమంత, రాజ్ నిడిమోరు లు మాత్రం ఈ విషయం కన్ఫర్మ్ చెయ్యలేదు.

కానీ ఈరోజు హైదరాబాద్ లో జరిగిన మా ఇంటి బంగారం సక్సెస్ మీట్ లో సమంత అధికారికంగా తన ప్రెగ్నెన్సీ విషయాన్ని అనౌన్స్ చేసింది. ప్రెగ్నెన్సీ విషయంలో చాలా సంతోషంగా ఉందని.. కొద్దిరోజులు మెటర్నిటీ లీవ్ తీసుకుంటానని ఈ సందర్భంగా సమంత ప్రకటించింది.

అంతేకాకుండా మా ఇంటి బంగారం సినిమాకు వస్తున్న ఆదరణను చూసి సమంత ఎమోషనల్ అయ్యింది. ఇక సమంత ప్రెగ్నెంట్ సమయంలో నటనకు బ్రేకిచ్చినా ఆమె మంచి కథ, దర్శకులు దొరికితే సినిమాలు నిర్మించడం మానదు అని తెలుస్తుంది.

Samantha Ruth Prabhu has confirmed her pregnancy