ఆంగ్ల హోమ్ >> తెలుగు వార్తలు >> Adarsha Kutumbam locks October release?

ఆదర్శ కుటుంబం - ఎందుకు క్లారిటీ ఇవ్వట్లే

Adarsha Kutumbam locks October release?


మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్-విక్టరీ వెంకటేష్ కాంబోలో క్రేజీ ఫ్యామిలీ ఎంటర్టైనర్ గా తెరకెక్కుతున్న ఆదర్శ కుటుంబం డోర్ నెం 42 చిత్రం షూటింగ్ విషయాలేవీ బయటకు రాలేదు. ఫస్ట్ లుక్ తప్ప ఆదర్శ కుటుంబం నుంచి ఎలాంటి అప్ డేట్ మేకర్స్ ఇవ్వలేదు. కానీ సడన్ గా సోషల్ మీడియాలో ఆదర్శ కుటుంబం దసరా స్పెషల్ గా అక్టోబర్ 2 విడుదల అనే వార్త వైరల్ అయ్యింది.

అది జరిగి మూడు నాలుగు రోజులవుతున్నా మేకర్స్ ఆదర్శకుటుంబం విడుదల తేదీ పై ఎలాంటి స్పందన లేకుండా సైలెంట్ గా ఉండడంపై అనుమానాలు మొదలయ్యాయి. త్రివిక్రమ్ ఆదర్శ కుటుంబం రిలీజ్ పై సైలెంట్ గా ఉండడం చూసి అసలు వెంకీ దసరాకు వస్తాడా అనే డౌట్ మొదలయ్యింది.

ఈ చిత్రంలో నారా రోహిత్ కీ రోల్ ప్లే చేస్తుండగా.. శ్రీనిధి శెట్టి హీరోయిన్ గా నటిస్తుంది. నివేద పేతురేజ్ స్పెషల్ సాంగ్ కోసం ఆదర్శ కుటుంబం లోకి ఎంటర్ అయ్యింది.
 

Adarsha Kutumbam update