లెనిన్ ప్రమోషన్స్ ఆమెకు తలనొప్పే
Dating rumours on sizzling beauty
అవును అఖిల్ లెనిన్ ప్రమోషన్స్ లో హీరోయిన్ భాగ్యశ్రీ బోర్ సే కి తలనొప్పే అనేలా ఉంది. కారణం రామ్ తో ఆంధ్ర తాలూకా కింగ్ చిత్రం చేసినప్పుడు రామ్ తో నిజంగానే భాగ్యశ్రీ బోర్సే ప్రేమలో పడింది అంటూ ప్రచారం జరిగింది. రామ్, అలాగే భాగ్యశ్రీలు తమ మద్యన ఏమి లేదని చెప్పడంతో అప్పుడు ఆ ప్రచారం సద్దుమణిగింది.
కానీ ఇప్పుడు లెనిన్ ప్రమోషన్స్ లో భాగ్యశ్రీ బోర్సే హైదరాబాద్ సెకండ్ హోమ్ అంటూ మాట్లాడడంతో మరోసారి రామ్ తో డేటింగ్ వార్తలు గుప్పుమన్నాయి. అంతేకాదు లెనిన్ ప్రమోషన్స్ లో రామ్ తో డేటింగ్ లో ఉన్నారటగా అనే ప్రశ్న ఎదురవరం ఖాయమనిపిస్తుంది. అసలు రామ్-భాగ్యశ్రీ బోర్సే లు డేటింగ్ లో ఉన్నారో, లేదో అనే విషయం బయట పెట్టడానికి మీడియా చాలానే ప్రయత్నాలు చేస్తుంది.
లెనిన్ ప్రమోషన్స్ కోసం ఆమె ఎక్కడ కనిపించినా రామ్ తో డేటింగ్ ప్రశ్న అయితే ఎదురు కాక తప్పదు. సో లెనిన్ ప్రమోషన్స్ భాగ్యశ్రీ బోర్సే కి తలనెప్పి తెచ్చిపెట్టడం ఖాయం.







































