నారా రోహిత్ కి వారసుడొచ్చాడు

Nara Rohith Blessed with a Baby Boy

 

హీరో నారా రోహిత్ తండ్రయ్యాడు. నారా రోహిత్ భార్య శిరీష పండండి బిడ్డకు జన్మనిచ్చారు. హీరోయిన్ శిరీష లెల్ల ని ప్రేమించి గత ఏడాది ప్రేమ వివాహం చేసుకున్నారు నారా రోహిత్. ముఖ్యమంత్రి చంద్రబాబు-భువనేశ్వరి దంపతుల చేతుల మీదుగా నారా రోహిత్ పెళ్లి జరిగిన విషయం తెలిసిందే.

ఈ ఏడాది మే లో శిరీష్ ప్రెగ్నెంట్ అనే విషయం ఆమె శ్రీమంతం వేడుకలతో బయటపడింది. శిరీష తాజాగా పండండి మగ బిడ్డకు జన్మనిచ్చిన విషయం తెలిసి నారా వారి అభిమానులు నారా రోహిత్ కి వారసుడొచ్చాడు. నారా రోహిత్ కి ఆయన తండ్రే బిడ్డ రూపంలో మళ్లీ వాళ్ళ ఇంట్లో అడుగుపెట్టడంటూ సంబరపడిపోతున్నారు.

నారా రోహిత్ తండ్రయిన విషయం తెలిసి ఆయన స్నేహితులు, సన్నిహితులు రోహిత్-శిరీష దంపతులకు శుభాకాంక్షలు తెలుపుతున్నారు.

Nara Rohith and Sirisha Blessed with a Baby Boy