లెనిన్ వాయిదాలకు అసలు కారణం అదా..!

Is he behind Lenin delayIs he behind Lenin delay

 

అఖిల్ అక్కినేని లేటెస్ట్ చిత్రం లెనిన్ పదే పదే వాయిదాలు పడి చివరికి జులై 10 న విడుదలకు రెడీ అవుతుంది. ఏజెంట్ డిజాస్టర్ తర్వాత వస్తున్న లెనిన్ పై అక్కినేని అభిమానుల్లో విపరీతమైన అంచనాలున్నాయి. అయితే లెనిన్ జూన్ 26 నుంచి జులై 10 కి పోస్ట్ పోన్ అవడం వెనుక పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలు పూర్తి కాకపోవడమే కాదు..

లెనిన్ మళ్లీ వాయిదా పడడానికి ప్రధాన కారణం కొన్ని కీలక సన్నివేశాలు రీ షూట్స్ జరగడమేనట. ఈ శని, ఆదివారాల్లోనూ లెనిన్ షూటింగ్ జరగడం సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. లెనిన్ లోని కొన్ని సన్నివేశాలు దర్శకనిర్మాతలకు సంతృప్తిగా అనిపించకపోవడంతోనే లెనిన్ రీ షూట్ చేసారని, అందుకే సినిమాని పోస్ట్ పోన్ చేసారని తెలుస్తుంది.

ఒక సాంగ్ చిత్రీకరణ తర్వాత అది కూడా పూర్తిగా సాటిస్ఫేక్షన్ రాకపోవడంతో ఆ పాటను మరోసారి చిత్రీకరించారని తెలుస్తుంది. ప్రస్తుతం లెనిన్ రిపేర్లు పూర్తయ్యాయి అని, పోస్ట్ ప్రొడక్షన్, ప్రమోషన్స్ ను ఈక్వల్ గా మొదలు పెడుతున్నారని తెలుస్తుంది. జులై 10 న అక్కినేని ఫ్యాన్స్ సంబరాలు చేసుకోవడానికి రెడీగా ఉండమని టీమ్ భరోసా ఇస్తుంది.  

Who Is The Reason For Akhil's Lenin Postponment?