ఆంగ్ల హోమ్ >> తెలుగు వార్తలు >> Drishyam 3 Telugu OTT Streaming Paused

దృశ్యం 3 తెలుగు ఆడియన్స్ కి షాక్

Drishyam 3 Telugu OTT Streaming Paused


మలయాళంలో మోహన్ లాల్ కీలక పాత్రలో జీతూ జోసెఫ్ తెరకెక్కించిన దృశ్యం సీక్వెల్ దృశ్యం 3 ఈసారి తెలుగులో రీమేక్ అవ్వలేదు. దానితో మలయాళంలో విడుదలైన ఈ చిత్రం తెలుగులో డబ్ అయ్యింది. డివైడ్ టాక్ తోనే రూ. 250 కోట్ల కలెక్షన్స్ తీసుకొచ్చిన దృశ్యం 3 గత అర్ధరాత్రి నుంచి అమెజాన్ ప్రైమ్ నుంచి స్ట్రీమింగ్ లోకి వచ్చేసింది.

అయితే తెలుగు వెర్షన్, కన్నడ, తమిళ , మలయాళ భాషల్లో స్ట్రీమింగ్ అవ్వాల్సిన దృశ్యం 3 చిత్రం తెలుగు ఆడియన్స్ కి అందుబాటులోకి రాలేదు. దృశ్యం 3 తెలుగు ఓటీటీ ఆడియన్స్ కి షాకిచ్చింది. కారణం ఈ సినిమాకు సంబంధించి తెలుగు రీమేక్ హక్కులు తమకు చెందుతాయని రాజ్ కుమార్ థియేటర్ ప్రైవేట్ లిమిటెడ్ అనే సంస్థ మద్రాస్ హైకోర్టుని సంప్రదించింది.

దృశ్యం 3 తెలుగు వెర్షన్ ఓటీటీ స్ట్రీమింగ్ పై  మద్రాస్ హైకోర్టు మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది. దానితో అమెజాన్ ప్రైమ్ నుంచి దృశ్యం 3 తెలుగు వెర్షన్ అందుబాటులోకి రాలేదు. కేవలం తమిళ, మలయాళ కన్నడ వెర్షన్స్ మాత్రమే అమెజాన్ ప్రైమ్ నుంచి అందుబాటులోకి వచ్చాయి.

Drishyam 3 Telugu OTT Release Stopped By Court