Advertisement
ఆంగ్ల హోమ్ >> తెలుగు వార్తలు >> Kodali Nani And Vallabhaneni Vamsi Activate In YCP

బూతు నేతలొస్తే మంచి రోజులెలా ?

Kodali Nani And Vallabhaneni Vamsi Activate In YCP

 

వైసీపీ లో బూతు నేతలుగా పేరు తెచ్చుకున్న కొడాలి నాని, వంశి వల్లభనేని లు కూటమి ప్రభత్వం అధికారంలోకి వచ్చాక సైలెంట్ అయ్యారు. పలు కేసులు ఈ నేతలను సైలెంట్ అయ్యేలా చేసింది. లేదంటే కొడాలి నాని ఈపాటికే జైలులో ఉండేవాడు. వల్లభనేని వంశి కొన్ని నెలల పాటు జైలులో ఉండొచ్చాడు.

కూటమి ప్రభుత్వం రాగానే వంశి కూడా కొన్ని నెలలు కనిపించకుండా పోయాడు. కొడాలి నాని సైలెంట్ గా ఉంటూనే హెల్త్ రీజన్స్ అని వైసీపీ పార్టీకి అంటీముట్టనట్టుగా ఉంటున్నాడు. కానీ ఇప్పుడు కొడాలి నాని, వంశి వల్లభనేని లు యాక్టీవ్ అవుతున్నారట. దానితో వైసీపీ కి మంచి రోజులొస్తున్నాయని బ్లూ మీడియా పబ్లిసిటీ చేసుకుంటుంది.

వైసీపీ ప్రభుత్వంలో బూతు మంత్రి గా కొడాలి నాని తెగ పాపులర్ అయితే.. వల్లభనేని సైలెంట్ గా టీడీపీ చంద్రబాబు, లోకేష్ లను టార్గెట్ చేసి పేరు తెచ్చుకున్నాడు. కూటమి ప్రభుత్వానికి భయపడి దాక్కున్న కొడాలి, వల్లభనేని ఇప్పుడు రాజకీయంగా కాస్త యాక్టీవ్ అవుతుంటే వైసీపీ కి మంచి రోజులొస్తున్నాయి, కూటమి ప్రభుత్వాన్ని ధీటుగా ఎదుర్కునే ధీరులొస్తున్నారంటూ వైసీపీ మీడియా తుత్తరపడుతుంది. 

Kodali Nani And Vallabhaneni Vamsi