నాకు ఆంధ్రాలోనే దిక్కులేదంటున్న PK

Pawan Kalyan Hyderabad Press Meet

 

ఏపీలో పదేళ్ల పోరాటం తర్వాత కూటమి ప్రభుత్వంలో డిప్యూటీ సీఎం పదవిని అనుభవిస్తున్న పవన్ కళ్యాణ్ తెలంగాణాలో తన జనసేన పార్టీని యాక్టీవ్ చేసేందుకు సన్నద్ధమవగా.. ఈరోజు జనసేన తలపెట్టిన సభను రేవంత్ రెడ్డి ప్రభుత్వం అడ్డుకుంది. తెలంగాణ ఫార్మేషన్ డే అంటూ ఇక్కడ అంత పెద్ద సభ నిర్వహిస్తే అల్లర్లు చెలరేగుతాయంటూ తెలంగాణ పోలీసులు పవన్ జనసేన సభకు అనుమతినివ్వలేదు.

దానితో పవన్ కళ్యాణ్ జనసేన నేతలను, కార్యకర్తలను డిజప్పాయింట్ చెయ్యడం ఇష్టం లేక.. ప్రభుత్వాన్ని, పోలీసులను ఛాలెంజే చేస్తూ తన ఇంటి దగ్గరే ప్రెస్ మీట్ నిర్వహించారు. తాను తెలంగాణలో సీఎం అవుదామని పార్టీని బలోపేతం చెయ్యడం లేదు.. పవన్ కళ్యాణ్ కి ఆంధ్రలోనే సీఎం అయ్యే దిక్కులేదు.. తెలంగాణాలో కూడానా అంటూ సెటేరికల్ గా మాట్లాడుతూ.. యువతను ఉత్తేజపరుస్తాను అని ఇక్కడి వారు నాకు సభకు అనుమతి ఇవ్వకుండా భయపడుతున్నారు.

ఎవ్వరు ఎక్కడి నంచి అయినా పార్టీ పెట్టుకొవచ్చు, పవన్ ని తెలంగాణ లో తిరగనివ్వమని బెదిరిస్తున్నారు, నేను భయపడను, ఇక్కడికన్నా నన్ను ఏపీలోనే ఎక్కువమంది బెదిరిస్తున్నారు. కేసీఆర్ బీఆర్ఎస్ పార్టీ ని ఏపీలో మొదలుపెడతాము అంటే మొదటిగా స్వాగతించినవాడిని నేనే.. ఏ రోజు KCR ని ఒక్క మాట అనలేదు.

బాంచన్ సార్ కాళ్లు మొక్కుదాం అనే ఉద్దేశమే ఉంటే… పార్టీ ఎందుకు పెడతామయ్యా? దాడి చేయాలంటే ఇదే నా అడ్రస్. ఎవ్వరు ఎక్కడైనా పార్టీ పెట్టుకోవచ్చు అంటూ తన ఇంటివద్ద పెట్టిన ప్రెస్ మీట్లో పవన్ ఉద్రేకంగా మట్లాడారు. 

Pawan Kalyan Press Meet