Loading...

టాక్సిక్ షూట్ పై కియారా కామెంట్స్ వైరల్

Kiara Advani on Toxic experience


కన్నడ స్టార్ హీరో యశ్ హీరోగా గీతూ మోహన్ దాస్ తెరకెక్కించిన టాక్సిక్ ద మూవీ చిత్రం అసలైతే మరో ఐదు రోజుల్లో పాన్ ఇండియా ప్రేక్షకుల ముందుకు రావాల్సి ఉండగా.. ఈ చిత్రాన్ని మరోసారి పోస్ట్ పోన్ చేసింది చిత్ర బృందం. టాక్సిక్ కి కొత్త రిలీజ్ డేట్ ఇవ్వకుండా అభిమానులను వెయిటింగ్ లో పెట్టిన టీమ్ అప్పుడప్పుడు టాక్సిక్ విశేషాలు రివీల్ చేస్తూ అటెన్షన్ క్రియేట్ చేస్తున్నారు.

తాజాగా టాక్సిక్ హీరోయిన్ కియారా అద్వానీ టాక్సిక్ సెట్ లోని విశేషాలను పంచుకుంది. తను టాక్సిక్ సెట్ లోకి రాగానే ఎవరికీ హాయ్, హలో అని చెప్పకూడదు అంటూ దర్శకురాలు గీతూ మోహన్ దాస్ తనకి కండిషన్ పెట్టినట్లుగా చెప్పారు. సెట్ లోకి ఎంటర్ అవగానే తన పాత్ర లోకి వెళ్లిపోవాలని, సెట్ లోకి ఎంటర్ అయ్యాక తన పాత్రలోనే ఉండాలి కానీ ఎవరికీ హలొ, హాయ్ చెప్పొద్దు అని చెప్పారట.

నేను సెట్ లోకి రాగానే అందరికి ఉత్సహంగా హాయ్, హలొ చెప్పడం అలవాటు, కానీ మా దర్శకురాలు మాత్రం పూర్తిగా నీ పాత్రకు సంబంధించే ఆలోచించాలి అని, నా టీమ్ తో సహా ఎవరికీ హలొ చెప్పొద్దూ అంటూ స్ట్రిట్ గా చెప్పారు. ఆవిడకు వర్క్ పై ఉన్న డెడికేషన్ చాలా ఆశ్చర్యంగా అనిపించేది.

టాక్సిక్ కోసం కన్నడ లో డైలాగ్స్ చెప్పడం నాకు ఛాలెంజింగ్ గా అనిపించేది. ఎందుకంటే ఒకటి ఇంగ్లీష్ లో మరొకటి కన్నడలో చిత్రీకరించేవారు. అందుకే ముందు రోజు నైట్ నేను డైలాగ్స్ బట్టి పట్టి వెళ్లేదానిని అంటూ కియారా టాక్సిక్ విషయాలను షేర్ చేసుకున్నారు.

 

Kiara Advani shares shocking Toxic revelations