Loading...

హీరోయిన్ కి చుక్క‌లు..హీరోకు స్వ‌ర్గం చూపించారు!

Kajol celebrates 20 years of Fanaa

 

బాలీవుడ్‌లో సరికొత్త ప్రేమకావ్యంగా నిలిచిన `ఫనా` చిత్రం విడుదలై అప్పుడే 20 ఏళ్లు పూర్తి చేసుకుంది. అమీర్ ఖాన్, కాజోల్ జంటగా  కునాల్ కోహ్లీ తెరకెక్కించిన  రొమాంటిక్ థ్రిల్లర్ అప్ప‌ట్లో  ఎలాంటి విజ‌యం సాధించిందో తెలిసిందే.  ప్రేక్షకుల హృదయాల్లో చెర‌గ‌ని  ముద్ర వేసింది. ఈ మైలురాయిని పురస్కరించుకుని నటి కాజోల్ ఆనాటి షూటింగ్ రోజులను గుర్తు చేసుకున్నారు. తెరవెనుక  పడిన కష్టాలను, ముఖ్యంగా ఒక పాట చిత్రీకరణలో ఎదురైన సవాలును పంచుకున్నారు.

సినిమాలోని కీలకమైన రొమాంటిక్ సన్నివేశాలను పోలాండ్‌లోని మంచు పర్వతాల మధ్య చిత్రీకరించారు. ఆ సమయంలో అక్కడ వాతావరణం -27°C మైనస్ డిగ్రీల చలితో కూడి ఉంది. అలాంటి గడ్డకట్టే చలిలో కూడా, స్క్రీన్ పై అందంగా కనిపించాలనే సినిమా నిబంధనల ప్రకారం కాజోల్ పల్చటి సల్వార్ మీజ్ మాత్రమే ధరించి నటించాల్సి వచ్చింది. ఆ శీతల వాతావరణంలో అంత తక్కువ దుస్తులతో నృత్యం చేయడం కెరీర్‌లోనే అత్యంత కష్టతరమైంద‌ని పేర్కొన్నారు.

షూటింగ్ సమయంలో హీరో, హీరోయిన్ల దుస్తుల మధ్య ఉన్న వ్య‌త్యాసాన్ని కాజోల్ చాలా సరదాగా,  కాస్త వ్యంగ్యంగా వివరించారు. తాను చలితో వణుకుతూ పల్చటి దుస్తుల్లో షాట్ కోసం సిద్ధమవుతుంటే? మరోవైపు సహనటుడు అమీర్ ఖాన్ మాత్రం దట్టమైన వింటర్ జాకెట్లు, లోపల థర్మల్ వేర్ ధరించి ఎంతో హాయిగా వెచ్చగా ఉన్నా రని గుర్తు చేసుకున్నారు. బాలీవుడ్ చిత్రాల పాటల్లో హీరోయిన్లను గ్లామరస్‌గా చూపించే క్రమంలో  ఎదుర్కొనే శారీరక ఇబ్బందులకు ఈ ఘటన చక్కని ఉదాహ రణగా నిలుస్తుంది. ప్రేక్షకులు తెరపై చూసే గ్లామర్, అందమైన లోకేషన్ల వెనుక నటీనటులు, సాంకేతిక నిపుణుల అపారమైన శ్రమ , అంకితభావం దాగి ఉంటాయనడానికి ఈ ఉదంతం  నిదర్శనంగా చెప్పొచ్చు.
 

20 Years of Fanaa