Loading...

ముంబై కి గ్యాంగ్ స్టర్ బాలయ్య

Balakrishna to show power in Mumbai


నందమూరి నటసింహ బాలకృష్ణ ప్రస్తుతం గోపీచంద్ మలినేని దర్శకత్వంలో నటిస్తున్నారు. #NBK111 గా తెరకెక్కుతున్న ఈ చిత్ర టైటిల్ గ్లింప్స్ ని దర్శకుడు గోపీచంద్ మలినేని బాలయ్య బర్త్ డే స్పెషల్ గా జూన్ 10 న వదలబోతున్నట్టుగా తెలుస్తుంది. #NBK111 షూటింగ్ స్టార్ట్ అయినప్పటినుంచి చాలా సైలెంట్ గా టీమ్ తన పని తను చేసుకుంటుంది.

మంచు మనోజ్ కీ రోల్ లో కనిపించనున్న ఈ చిత్రంలో బాలయ్య డ్యూయెల్ రోల్ చేస్తున్నారనే ప్రచారం జరిగినా #NBK111 లో బాలయ్య సింగిల్ గానే కనిపిస్తారట. అది కూడా గ్యాంగ్ స్టర్ రోల్ లో బాలయ్య కనిపించబోతున్నారట. #NBK111 లో యాక్షన్ సీక్వెన్స్ సినిమాకే హైలెట్ గా నిలుస్తాయని యూనిట్ టాక్.

ఇక ఓ భారీ షెడ్యూల్ కోసం బాలయ్య అలాగే #NBK111 లో నటిస్తున్న కీలక నటులతో కలిసి గోపీచంద్ మలినేని ముంబై వెళ్ళబోతున్నారట. ఈ షెడ్యూల్లో కొన్ని కీలక సన్నివేశాలతోపాటు, యాక్షన్ సీక్వెన్స్ ని తెరకెక్కించనున్నారని తెలుస్తుంది. ఈ వారంలోనే #NBK111 టీమ్ ముంబైలో అడుగుపెట్టబోతుందని సమాచారం.

NBK111 heading to Mumbai