Loading...
ఆంగ్ల హోమ్ >> తెలుగు వార్తలు >> Bobby Deol Says Alpha's Action Ensured Tough Shoot

లేడీ భామ‌లతో త‌న్నులు కాసిన విల‌న్!

Bobby Deol Says Alpha's Action Ensured Tough Shoot

 

యష్ రాజ్ ఫిల్మ్స్  ప్రతిష్టాత్మకంగా రూపొందిస్తున్న స్పై యూనివర్స్ చిత్రాలపై ప్రేక్షకుల్లో భారీ అంచనాలు ఉన్నాయి. ఈ సిరీస్‌లో మొదటిసారిగా మహిళా ప్రాధాన్యత కలిగిన హై-వోల్టేజ్ యాక్షన్ థ్రిల్లర్‌గా `ఆల్ఫా`  తెరకెక్కుతోన్న సంగతి తెలిసిందే. అలియా భట్, శార్వరి ప్రధాన పాత్రల్లో న‌టిస్తోన్న‌  మోస్ట్ అవేటెడ్ మూవీలో బాలీవుడ్ స్టార్ నటుడు బాబీ డియోల్ శక్తివంతమైన విలన్ పాత్ర పోషిస్తున్నారు. `యానిమల్` చిత్రంతో సరికొత్త విలనిజానికి కేరాఫ్ అడ్రస్‌గా మారిన బాబీ డియోల్ ఈ చిత్రంలో తన పాత్ర .. యాక్షన్ సీక్వెన్స్‌లపై ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.

ఈ సినిమా షూటింగ్ అనుభవాల గురించి బాబీ డియోల్ మాట్లాడారు. `ఆల్ఫా` చిత్రంలో యాక్షన్ సన్నివేశాలు చాలా రియలిస్టిక్‌గా, రా గా ఉంటాయన్నారు.  వీఎఫ్ఎక్స్ ,  రోప్ షాట్స్‌పైనే ఆధారపడకుండా సహజత్వానికి దగ్గరగా ఫైట్స్ డిజైన్ చేశారని తెలిపారు. ఈ విధమైన రియల్ యాక్షన్ వల్ల షూటింగ్ షెడ్యూల్స్ తమకు శారీరకంగా ఎంతో సవాలు తో కూడుకున్నవిగా మారాయన్నారు.  ప్రతి రోజూ సెట్స్‌పై కఠినంగా శ్రమించాల్సి వచ్చిందని  వెల్ల డించారు.

యాక్షన్ సీన్స్‌లో అలియా భట్, శార్వరిల అంకితభావాన్ని బాబీ డియోల్ ఎంతగానో అభినందించారు.  ఇద్దరు యంగ్ హీరోయిన్లు  కఠినమైన యాక్షన్ సీక్వెన్స్‌లలో నటిస్తారని  అస్సలు ఊహించలేదన్నారు. షూటింగ్ సమయంలో వారు చూపించిన పట్టుదల, కష్టపడే తత్వం తనను ఆశ్చర్యపరిచాయని బాడీ లాంగ్వేజ్ మరియు స్టంట్స్‌లో వారిద్దరూ నెక్స్ట్ లెవెల్ పర్ఫార్మెన్స్ ఇచ్చారని బాబీ డియోల్ కొనియాడారు. వారి ఎనర్జీకి మ్యాచ్ అవ్వడం తనకు కూడా ఓ మంచి టాస్క్ లా అనిపించింద‌న్నారు. వారిద్ద‌రితో యాక్ష‌న్ సీన్స్ చేయ‌డం త‌న‌కు సైతం స‌వాల్ గా అనిపించ‌ద‌న్నారు. చివ‌రిగా చెడుపై ఎప్ప‌టికీ మంచే గెలుస్తుంద‌ని..వారిద్ద‌రి చేతిలో తానే ఓడిపోయాన‌న్నారు.

Bobby Deol on Alpha's Action