విరాట్-అనుష్కల బాటలోనే కత్రినా-విక్కీ కౌశల్
Katrina Kaif-Vicky Kaushal
బాలీవుడ్ స్టార్ జంట కత్రినా కైఫ్ -విక్కీ కౌశల్ తమ సంతానానికి సంబంధించిన విషయాల్లో అత్యంత కీలకమైన నిర్ణయం తీసుకున్నారు. తాజాగా విమానాశ్రయంలో పండంటి బాబు విహాన్ తో కలిసి ప్రయాణిస్తున్న తరుణంలో, అక్కడ ఉన్న మీడియా ఫోటోగ్రాఫర్లను ఓ ప్రత్యేకమైన విజ్ఞప్తి చేశారు. తమ బాబును కెమెరాల్లో బంధించవద్దని, సోషల్ మీడియా , వార్తా వేదికల్లో అతడి ఫోటోలను ప్రసారం చేయోద్దని ఎంతో సున్నితంగా కోరారు. సెలబ్రిటీ హోదా ఉన్నా? తమ బిడ్డకు సాదాసీదా, ప్రశాంతమైన బాల్యాన్ని అందించాలనే ఉద్దేశంతోనే ఈ నిర్ణయం తీసుకున్నట్లు అక్కడ సన్నివేశం కనిపించింది.
బాలీవుడ్ చిత్ర పరిశ్రమలో స్టార్ కపుల్స్ పిల్లల గోప్యత కోసం ఇలా మీడియాకు దూరంగా ఉంచడం ఇదే మొదటిసారి కాదు. గతంలో టీం ఇండియా స్టార్ క్రికెటర్ విరాట్ కోహ్లీ, నటి అనుష్క శర్మ జంట కూడా తమ పిల్లల విషయంలో ఇదే విధమైన కఠినమైన నో-ఫోటో పాలసీని అవలంబించి సరికొత్త ట్రెండ్‌కు శ్రీకారం చుట్టారు. నిరంతరం మీడియా వెలుగుల మధ్య పెరగడం వల్ల పిల్లల మానసిక వికాసంపై ప్రభావం పడుతుందనే ఉద్దేశంతోనే కత్రినా, విక్కీ సైతం ఇప్పుడు ఆదర్శవంతమైన ఆ పాత బాటనే ఎంచుకున్నారు. తమ వ్యక్తిగత సరిహద్దులను గౌరవించాల్సిందిగా మీడియా వర్గాలను కోరడం సెలబ్రిటీల బాధ్యతాయుతమైన పేరెంటింగ్‌కు నిదర్శనంగా నిలుస్తోంది.
డిజిటల్ యుగంలో సోషల్ మీడియా క్రేజ్, లైక్స్ కోసం సెలబ్రిటీల వ్యక్తిగత జీవితాలపై కెమెరాల నిఘా రోజురోజు కూ మితిమీరుతోంది. ఇలాంటి విపరీతమైన పాపరాజీ సంస్కృతి నడుమ, స్టార్స్ తమ పిల్లల ప్రైవసీ హక్కుల కోసం గొంతు ఎత్తడం అత్యంత ఆవశ్యకమైన మార్పుగా విశ్లేషకులు భావిస్తున్నారు. మీడియా కూడా నటీనటుల భావాలను గౌరవిస్తూ పిల్లల ఫోటోలను తీయకుండా సహకరించడం ఆరోగ్యకరమైన వాతావరణానికి నాంది పలుకుతోంది. గ్లామర్ ప్రపంచానికి దూరంగా కనుమరుగుగా వారసులను పెంచాలనుకునే సెలబ్రిటీల ధోరణి రాబోయే రోజుల్లో మరింత మంది స్టార్స్ అనుసరించేలా చేసే అవకాశాలు కనిపిస్తున్నాయి.







































