దృశ్యం 3 : ఓపెనింగ్స్ తో దుమ్మురేపింది

మలయాళ హిట్ ప్రాంచైజీ దృశ్యం సీరీస్ లో వచ్చిన దృశ్యం 3 నిన్న గురువారం మే 21 న థియేటర్స్ లో విడుదలైంది. మోహన్ లాల్-జీతూ జోసెఫ్ ల కలయికలో తెరకెక్కిన దృశ్యం , దృశ్యం 2, ఎంత పెద్ద హిట్ అయ్యాయో.. అంతకుమించి దృశ్యం 3 హిట్ అవుతుంది అనుకున్నారు. కానీ మిక్స్డ్ రెస్పాన్స్ దృశ్యం 3 కి కనిపించింది.
అటు రివ్యూయర్స్ అలాగే ఆడియన్స్ మొత్తంగా దృశ్యం 3 ని యావరేజ్ అని తేల్చేసారు. అయినప్పటికి దృశ్యం 3 ఓపెనింగ్స్ లో సెన్సేషన్ కలెక్షన్స్ సాధించింది. దృశ్యం 3 రిలీజైన తొలి రోజే రూ.15.85 కోట్ల నెట్ వసూళ్లు రాబట్టింది. గ్రాస్ పరంగా చూస్తే రూ.18.37 కోట్ల వసూళ్లు కలెక్ట్ చేసింది.
అలాగే ఓవర్సీస్ లోను దృశ్యం 3 ఓపెనింగ్ రోజు హవా చూపించింది. ఓవర్సీస్ లో మొదటిరోజు రూ. 25 కోట్లు వసూలు చేయడంతో ప్రపంచవ్యాప్తంగా మొదటి రోజే దృశ్యం 3 రూ. 43.37 కోట్లకు పైగా కలెక్షన్స్ రాబట్టి రికార్డ్ క్రియేట్ చేసింది. ఓపెనింగ్ డే వసూళ్లతో మలయాళ ఇండస్ట్రీలో మొదటిరోజు అత్యధిక వసూళ్లు సాధించిన చిత్రాల లిస్ట్ లో దృశ్యం-3 సెకండ్ ప్లేస్ లో నిలిచింది.






































