Advertisement
ఆంగ్ల హోమ్ >> తెలుగు వార్తలు >> Rhea Chakraborty Announces Social Media Break

SM కి బ్రేకిచ్చిన వివాదాస్పద హీరోయిన్

Rhea Chakraborty Announces Social Media Break


సోషల్ మీడియాలో నటులకు ఎంత క్రేజ్ ఉంటుందో.. అంతే నెగిటివిటి కూడా ఉంటుంది. నచ్చిన వాళ్లు లైక్ చేస్తారు, నచ్చని వాళ్ళు హేట్ చేస్తారు. తమని పొగిడినప్పుడు ఎంతగా సంతోషపడతారో, తిట్టినప్పుడు అంతే బాధపడతారు సదరు సెలబ్రిటీస్. అందుకే చాలామంది సోషల్ మీడియాలో యాక్టీవ్ గా ఉండలేరు.

బాలీవుడ్ లో వివాదాలకు కేరాఫ్ గా నిలిచిన రియా చక్రవర్తి సుశాంత్ సింగ్ రాజ్ ఫుట్ సూసైడ్ కేసులో సోషల్ మీడియా నుంచి విపరీతమైన నెగిటివిటి ఎదుర్కొంది. ఆమె ఆ కేసులో కొన్నాళ్ళు జైలుకు వెళ్ళొచ్చింది. రీసెంట్ గా రియా చక్రవర్తికి సుశాంత్ సింగ్ ఆత్మహత్య కేసులో క్లీన్ చిట్ దక్కింది. దానితో ఆమె కెరీర్ లో బిజీ అయ్యేందుకు ప్రయత్నాలు మొదలు పెట్టింది.

అలాంటి సమయంలో పాపులారిటీ కోసం సోషల్ మీడియాని వాడుకోవాల్సిన రియా చక్రవర్తి ఇప్పుడు సోషల్ మీడియా నుంచి తప్పుకోవడం హాట్ టాపిక్ అయ్యింది. ఆమె ఆ విషయాన్ని తెలుపుతూ..

ఈ మధ్య కాలంలో నన్ను నేను కాస్త మిస్ అవుతున్నట్లు అనిపిస్తోంది. సోషల్ మీడియాలోని నిరంతర శబ్దం, స్క్రోలింగ్, ఆన్లైన్ ప్రపంచంతో పోటీ పడటం.. ఇవన్నీ నేను ఊహించిన దానికంటే ఎక్కువ భారంగా మారాయి. ప్రతి క్షణాన్ని కెమెరాలో బంధించాలనే ఆలోచన లేకుండా ప్రశాంతంగా గడపాలి. 

అన్ని ఆలోచించాకే కాస్త సోషల్ మీడియా నుండి ఒక అడుగు వెనక్కి వేస్తున్నాను. ప్రస్తుతానికి వర్చువల్ లైఫ్ కంటే నిజ జీవితంలో గడిపే క్షణాలకే నా మొదటి ప్రాధాన్యత. త్వరలోనే మళ్లీ కలుద్దాం.. అంటూ రియా చక్రవర్తి సోషల్ మీడియా నుంచి తప్పుకుంటున్నట్టుగా ప్రకటించింది.

Rhea Chakraborty ,