పెద్ది అయ్యిపోయింది - NTRNeel మిగిలింది

నిన్న మే 18 సోమవారం రామ్ చరణ్ పెద్ది ట్రైలర్ రిలీజ్ అయ్యింది. పెద్ది లో రామ్ చరణ్ లుక్స్ ని మెగా ఫ్యాన్స్ మాత్రమే కాదు.. పాన్ ఇండియా ఆడియన్స్ బాగా ఎంజాయ్ చేసారు. పెద్ది ట్రైలర్ రికార్డ్ వ్యూస్ తో దూసుకుపోతుంది. విడుదలైన 12 గంటల్లోనే 60 మిలియన్ వ్యూస్ ని సొంతం చేసుకుంది.
సోషల్ మీడియాలో పెద్ది ట్రైలర్ వైరల్ అవడం చూసాము.. ఇక మిగిలింది ఈరోజు మంగళవారం మే 19 న విడుదల కాబోయే #NTRNeel ల డ్రాగన్ గ్లింప్స్. ఈరోజు రాత్రి 11.55 నిమిషాలకు #NTRNeel గ్లింప్స్ రిలీజ్ చెయ్యబోతున్నారు. 4 నిమిషాలపైనే నిడివి కలిగి ఉన్న ఈ గ్లింప్స్ తో ఎన్టీఆర్ ఫ్యాన్స్ సోషల్ మీడియా షేక్ చెయ్యడానికి కాచుకుని ఉన్నారు.
పెద్ది పండగ పూర్తయ్యింది, డ్రాగన్ పండగ మొదలు కావాల్సి ఉంది. మరి ఎన్టీఆర్ ఫ్యాన్స్ డ్రాగన్ గ్లింప్స్ తో ఎంతగా పిచ్చెక్కిస్తారో చూడాలి.
Dragon ,Peddi vs Dragon






































