ఆంగ్ల హోమ్ >> తెలుగు వార్తలు >> Chandrababu and Pawan Kalyan follows PM Modi

బాబు-పవన్ ఫాలో అవుతున్నారు.. మరి వాళ్ళు

Chandrababu and Pawan Kalyan follows PM Modi

పీఎం నరేంద్ర మోడీ పెట్రోల్, డీజిల్ వినియోగం తగ్గించాలని పిలుపునివ్వడమే కాదు అందుకు అనుగుణంగా ఆయనే ముందుగా అది ఆచరిస్తున్నారు. అందులో భాగంగా పీఎం కాన్వాయ్ ని సగానికి సగం కుదించి తక్కువ వాహనాలు వినియోస్తున్నారు. ఇంకా బిజెపి నాయకులు అమిత్ షా, రాజ్ నాధ్ సింగ్ ఇలా మినిస్టర్స్ కూడా తమ తమ వాహనాలను కుదించుకున్నారు.

ఇప్పుడు అదే విధంగా ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, మంత్రి నారా లోకేష్ లు కూడా తమ తమ అధికారిక వాహనాలను సగానికి సగం కుదించేశారు. పెట్రోలు, డీజిల్ వాడకం తగ్గించాలన్న ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ గారు పిలుపుని అనుసరించి ఈ నిర్ణయం తీసుకున్నారు, ముఖ్యమంత్రి, ఉప ముఖ్యమంత్రి లు.

మోడీ ని చంద్రబాబు, పవన్ కళ్యాణ్, లోకేష్ ఫాలో అవుతున్నారు. మరి మిగతా వాళ్ళు అంటే మిగతా రాష్ట్రాల ముఖ్యమంత్రులు,  మంత్రులు, అలాగే ప్రతిపక్ష నాయకులూ, కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ గాంధీ వీళ్లంతా కూడా మోడీ పిలుపును పాటిస్తారా, ఆయన చెప్పినదానిలో తప్పేమి లేదు. మరి ప్రతిపక్షాలు మోడీ మాటను ఆచరిస్తాయో, లేదో అనేది ఆసక్తిగా మారింది.

Lokesh and Pawan Kalyan Follow Modi and Chandrababu in Cutting Down Convoy Vehicles