ఉత్తరప్రదేశ్ లో ప్రకృతి వైపరీత్యం

Thunderstorm batters Uttar Pradesh

దేశంలోని పలు రాష్ట్రాలు సూర్య భగవానుడు భగభగలతో ప్రజలు అల్లాడిపోతున్నారు. ఎన్నడూ చూడని ఎండలను ఈ ఏడాది రెండు తెలుగు రాష్ట్రాల ప్రజలు చూస్తున్నారు. తెలంగాణలోని కొన్ని జిల్లాలో 46 డిగ్రీలు నమోదు అవుతున్నాయి. ఏపీలోని పలు జిల్లాల ప్రజలు ఎండ వేడికి తట్టుకోలేక అల్లాడిపోతున్నారు.

కానీ కొన్ని రాష్ట్రాలలో అకాల వర్షాలతో ప్రజలు అతలాకుతలం అవుతున్నారు. ఉత్తరప్రదేశ్‌లో నిన్న‌ సాయంత్రం సంభవించిన పెను తుపాను విలయతాండవం చేసింది. ఉత్తరప్రదేశ్ లోని కొన్ని జిల్లాల్లో నిన్న సాయంత్రం సంభవించిన ప్రకృతి వైపరీత్యానికి 45 మంది నుంచి 89 మంది వరకు చనిపోవడం కలకలం సృష్టించింది.

ఉత్తరప్రదేశ్ లోని కొన్ని జిల్లాల్లో భారీ వర్షం, బలమైన ఈదురు గాలులతో కూడిన ఈ విలయానికి పలువురు మృత్యువాత పడ్డారు. భీకర గాలులకు వందలాది చెట్లు నేలకూలాయి, ఇళ్లు దెబ్బతిన్నాయి.

ప్రయాగ్‌రాజ్‌, భదోహీ, మీర్జాపూర్‌, ఫతేపూర్‌, హర్దోయి, కాన్పూర్ దేహత్, కౌశాంబి జిల్లాల్లో ఈ భారీ గాలులు, భారీ వర్షం భీబత్సం సృష్టించింది. చెట్లకింద, ట్రక్కుల కింద, ఇళ్లకింద నిలబడిన వారు భీకరగాలులతో ప్రాణాలు పోగొట్టుకున్నారు. 

Nearly 90 people killed as storm and rain batter Uttar Pradesh