సూర్య వీరభద్రుడి కి అనుకోని కష్టం

Karuppu Morning Shows Cancelled

 

సూర్య వరస ప్లాప్ లతో సతమతమవుతుంటే ఇప్పుడు ఈరోజు మే 14 న విడుదల కావాల్సిన కరుప్పు(వీరభద్రుడు) చిత్రం మార్నింగ్ షోస్ క్యాన్సిల్ అవడం హాట్ టాపిక్ అయ్యింది. సూర్య హీరోగా త్రిష హీరోయిన్ గా నటుడు ఆర్ జె బాలాజీ దర్శకత్వంలో తెరకెక్కిన కరుప్పు(తమిళ టైటిల్) వీరభద్రుడు(తెలుగు టైటిల్) ఈరోజు గురువారం విడుదల కావాల్సి ఉంది.

తమిళనాట సీఎం విజయ్ కరుప్పు చిత్రానికి స్పెషల్ షోస్ కి పర్మిషన్ ఇచ్చారు. కానీ స్పెషల్ షోస్ పడలేదు. అంతేకాదు కరుప్పు మార్నింగ్ షోస్ కూడా రద్దయ్యాయి. కారణం కరుప్పు నిర్మాతల అప్పులు సూర్య సినిమాకి అడ్డంకులు ఏర్పడేలా చేసాయి. డ్రీమ్ వారియర్ సినిమాకు సంబంధించి గ‌త సినిమాల అప్పులు ఇప్పుడు సూర్య వీర‌భ‌ద్రుడు ని వెంటాడుతున్నాయి.

దాదాపు గా డ్రీమ్ వారియర్ వారు 20 నుంచి 40 కోట్ల అప్పులు క్లియరెన్స్ రావాల్సి ఉండగా.. అది జరగకపోవడంతో కరుప్పు విడుదల కాకుండా అడ్డుకున్నారు. దానికి సంబందించిన చర్చలు జరుగుతున్నాయి. మార్నింగ్ షోస్ రద్దయినా, మ్యాట్నీ షోస్ పడతాయా లేదా అనేది ఇప్పుడు సస్పెన్స్ గా మారింది. 

Karuppu Morning Shows Cancelled Due to Financial Issues