Loading...
ఆంగ్ల హోమ్ >> తెలుగు వార్తలు >> TN Assembly: Vijay wins the floor test

TN అసెంబ్లీ - బలనిరూపణలో విజయ్ గెలుపు

TN Assembly: Vijay wins the floor test

తమిళనాడు అసెంబ్లీ లో సీఎం విజయ్ విజయం సాధించారు. రెండు రోజుల క్రితమే సీఎం గా ప్రమాణస్వీకారం చేసిన విజయ్ నేడు తమిళనాడు అసెంబ్లీ లో బలనిరూపణకు సిద్ధమయ్యారు. 108 సీట్ల తో టీవీకే ను గెలిపించుకున్న విజయ్ కు పూర్తి మెజారిటీతో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసే అవకాశం దక్కకపోవడంతో ఆయన కాంగ్రెస్, వామపక్షాల సపోర్ట్ తీసుకున్నారు.

ఇక తను రెండు స్థానాల్లో గెలవడంతో అందులో విజయ్ ఈస్ట్ తిరుచ్చి వదులుకోవడంతో అసెంబ్లీ లో టీవీకే బలం 107 కి పడిపోయింది. అంతేకాకుండా టీవీకే ఎమ్యెల్యే ఒక్క ఓటుతో గెలవడంతో హై కోర్టు ఆయన్ని ఓటింగ్ లో పాల్గొనకూడదు అని చెప్పడం టీవీకే బలం 106 కి పరిమితమయ్యింది.

ఈలోపే అన్నాడీఎంకే లోని ఓ వర్గం ఎమ్యెల్యేలు లు విజయ్ టీవీకే కి సపోర్ట్ గా నిలిచారు. ఈరోజు తమిళనాడు అసెంబ్లీలో విజయ్ బలనిరూపంలో 144 ఓట్ల మద్దతుతో గెలిచారు. ఆయనకు వ్యతిరేఖంగా 22 ఓట్లు రాగా.. అందులో 61 మంది వాకౌట్ చేసారు.

సో పూర్తి మెజారిటీ తో విజయ్ తమిళనాడు సీఎం గా బాధ్యతలు స్వీకరించారు.

Vijay proves his majority in the TN Assembly