ఎన్టీఆర్ బర్త్ డే కి దేవర 2 పోస్టర్
Devara 2 poster for NTR's birthdayయంగ్ టైగర్ ఎన్టీఆర్ బర్త్ డే వచ్చేస్తుంది. మరొక్క వారం రోజుల్లో సోషల్ మీడియాను షేక్ చేసేందుకు ఎన్టీఆర్ ఫ్యాన్స్ కాచుకుని కూర్చున్నారు. ఎన్టీఆర్ బర్త్ డే కి ఫ్యాన్స్ సెలెబ్రేషన్స్ తో పాటుగా ఆయన మూవీస్ అప్ డేట్స్ సెలెబ్రేషన్స్ కూడా ఉండబోతున్నాయి.
అందులో #NTRNeel కాంబో నుంచి బర్త్ డే కి గ్లింప్స్ ఇస్తున్నట్టుగా మేకర్స్ ఎప్పుడో చెప్పారు. మే 20 న బర్త్ డే రోజున ఎన్టీఆర్ మూవీస్ నుంచి రాబోతున్న అప్ డేట్స్ కోసం ఎన్టీఆర్ ఫ్యాన్స్ చాలా అంటే చాలా వెయిట్ చేస్తున్నారు. అందులో ముఖ్యంగా దేవర 2 నుంచి ఎలాంటి అప్ డేట్ వస్తుందా అని.
దేవర 2 నుంచి ఎన్టీఆర్ బర్త్ డే కోసం స్పెషల్ రాబోతుంది. అది దేవర 2 పోస్టర్ ని మేకర్స్ వదలబోతున్నట్టుగా తెలుస్తుంది. ఇది రూమర్ కాదు పక్కాగా పోస్టర్ రాక కన్ ఫర్మ్ అంటున్నారు. ఇక మిగిలింది. త్రివిక్రమ్-ఎన్టీఆర్ కాంబో అప్ డేట్. మరి అది ఉంటుందా, ఉండదా అనేది తెలియాలి.







































