అల్లు అర్జున్ తో పూజ - మూడోసారి
Pooja Hegde to romance Allu Arjun againవేలం పాటలో ఒకటోసారి, రెండోసారి, మూడోసారి అన్నట్టుగా అల్లు అర్జున్-పూజ హెగ్డే జంట మూడోసారి జత కట్టబోతున్నారనే వార్త సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. డీజే దువ్వాడ జగన్నాధం చిత్రంతో టాలీవుడ్ లో హిట్ అందుకున్న పూజ హెగ్డే ఆ తర్వాత స్టార్ హీరోలందరితో జోడి కట్టింది.
ఇక అల్లు అర్జున్ తో అలా వైకుంఠపురములో చిత్రంతో నటించి బ్లాక్ బస్టర్ హిట్ అందుకున్న పూజ హెగ్డే కి కొన్నాళ్లుగా సమయం కలిసి రావడం లేదు. సినిమాలు చేస్తున్నా నిరాశపరిచే ఫలితాలతో డిజప్పాయింట్ అవుతుంది. ప్రస్తుతం సౌత్ లో ఒకటి అరా సినిమాలు చేస్తున్న పూజ హెగ్డే కు అల్లు అర్జున్ తో మూడోసారి నటించే అవకాశం వచ్చినట్లుగా తెలుస్తుంది.
ప్రస్తుతం అట్లీ దర్శకత్వంలో అల్లు అర్జున్, దీపికా ఇంకా మరికొంతమంది హీరోయిన్స్ తో రొమాన్స్ చేస్తున్నారు. ఇక తన తదుపరి చిత్రం లోకేష్ కనగరాజ్ తో కలిసి చేసే చిత్రంలో అల్లు అర్జున్ సరసన పూజ హెగ్డే అయితే బావుంటుంది అని దర్శకుడు లోకేష్ భావిస్తున్నట్టుగా తెలుస్తుంది.
మరి పూజ హెగ్డే కి ఈ అవకాశం వస్తే ఆమెను మరోసారి అల్లు అర్జున్ ఆదుకున్నట్టే. వరస ప్లాప్స్ లో ఉన్న పూజ హెగ్డే కి ఈ లక్కీ ఛాన్స్ వస్తుందేమో చూడాలి.







































