విజయ్ ఎఫెక్ట్ - అన్నాడీఎంకేలో చీలిక

Vijay Affect - Split in AIADMKVijay Affect - Split in AIADMK

తమిళనాట రాజకీయాలు రసవత్తర పరిస్థితి నుంచి విజయ్ సీఎం అయ్యేవరకు వెళ్లాయి. తమిళనాడు లో బలమైన పార్టీలుగా పేరు పొందిన డీఎంకే, అన్నాడీఎంకే లను విజయ్ టీవీకే పార్టీ మట్టి కురిపించింది. డీఎంకే కి ఒకొనొక సమయంలో ప్రతిపక్ష హోదా కూడా దక్కదు అనుకున్నారు. అన్నాడీఎంకే రెండో స్థానంలో ఉంటుంది అనుకుంటే అది మూడో స్థానానికి పరిమితమైంది.

ఇక విజయ్ పార్టీకి పూర్తి మెజారిటీ రాకపోయినా కూటమి కట్టి ప్రభుత్వాన్ని ఏర్పాటు చెయ్యడానికి కిరెడీ అయినప్పుడు అన్నాడీఎంకే విజయ్ పార్టీకి మద్దతు ఇవ్వను అంది. కారణం కొంతమంది విజయ్ పార్టీని వ్యతిరేఖించారు. ఆ తరవాత డీఎంకే, అన్నాడీఎంకే కలుస్తాయని అనుకున్నా అది గాలివార్తే అయ్యింది.

విజయ్ అన్నాడీఎంకే తో పొత్తు కోసం ట్రై చెయ్యగా వారు ఒప్పుకోని కారణంగా విజయ్ వామపక్షాల మద్దతు కోరి తమిళనాడు సీఎం గా ప్రమాణ స్వీకారం చేసారు. అయితే విజయ్ పార్టీకి మద్దతు ఇవ్వని కారణంగా అన్నాడీఎంకే లోని కొంతమంది ఎమ్యెల్యే లు అలకబూనారు. పళనిస్వామి నాయకత్వంపై పార్టీలోని సీనియర్ నేతలు తీవ్ర అసంతృప్తిగా ఉన్నట్లు తెలుస్తోంది.

కొంతమంది మాజీ మంత్రులు పళనిస్వామి నాయకత్వంపై తమ అభ్యంతరాలను బహిరంగంగా వ్యక్తం చేశారని తెలుస్తుంది. మరికొంతమంది విజయ్ కారణంగా అన్నాడీఎంకే పార్టీపై అలిగారని, అన్నాడీఎంకే పార్టీ రెండుగా చీలిపోయింది అనే టాక్ మొదలైపోయింది. ఇదంతా కేవలం విజయ్ ఎఫెక్ట్ అంటున్నారు.

Vijay's win cracks AIADMK: Some MLAs want to back TVK