ఆంగ్ల హోమ్ >> తెలుగు వార్తలు >> Vijay wife and Kids missing from his Oath taking Ceremony

ద‌ళ‌ప‌తి భార్యా పిల్ల‌లు ఎక్క‌డ‌?

Vijay wife and Kids missing from his Oath taking Ceremony

తమిళనాడు నూతన ముఖ్యమంత్రిగా టీవీకే అధినేత‌, దళపతి విజయ్ బాధ్యతలు స్వీకరించిన వేళ వేదికపై ఆయన భార్య సంగీత సోర్నలింగం.. పిల్లలు కనిపించకపోవడం రాజకీయ వర్గాల్లో పెద్ద ఎత్తున చర్చకు దారితీసింది. గత కొంతకాలంగా వీరిద్దరూ విడివిడిగా ఉంటున్నారనే వార్తలు వస్తున్న నేపథ్యంలో ఇంత‌టి కీలక ఘట్టానికి కూడా కుటుంబ సభ్యులు దూరం కావడం ఆ అనుమానాలకు మరింత బలం చేకూర్చింది.

ముఖ్యంగా ప్ర‌మాణ స్వీకార‌ వేదిక వ‌ద్ద నటి త్రిష సందడి చేయడం సోషల్ మీడియాలో హాట్ టాపిక్‌గా మారింది. ప్రస్తుతం సంగీత లండన్‌లో ఉంటూ తమ కుటుంబానికి చెందిన హోటల్ - రియల్ ఎస్టేట్ వ్యాపారాలను పర్యవేక్షిస్తున్నట్లు సమాచారం. కేవలం సంగీత పేరిటే వందల కోట్ల నికర ఆస్తులు ఉన్నాయని..తమ పిల్లల చదువుల నిమిత్తం .. వ్యాపార బాధ్యతల వల్ల ఆమె లండన్‌లోనే స్థిరపడ్డారని సన్నిహిత వర్గాలు చెబుతున్నాయి.

రాజకీయంగా విజయ్‌ను ఇబ్బంది పెట్టేందుకు ప్రత్యర్థులు ఆయన వ్యక్తిగత జీవితాన్ని, విడాకుల అంశాన్ని ప్రచారంలోకి తెచ్చినా తమిళ ఓటర్లు వాటిని ఏమాత్రం పట్టించుకోలేదు. విజయ్ తన వ్యక్తిగత సమస్యలను పక్కన పెట్టి ప్రజా క్షేత్రంలోకి రావడం... పక్కా ప్రణాళికతో `తమిళగ వెట్రి కళగం` పార్టీని విజయతీరాలకు చేర్చడం విశేషం. ప్రజలు  వ్యక్తిగత జీవితం కంటే విజ‌య్‌లో ఉన్న నాయకత్వ లక్షణాలను.. మార్పు కోరుకునే తత్వాన్ని నమ్మి పట్టం గట్టారు.

ఫ్యామిలీ డ్రామాలు ఎన్ని నడిచినా.. రాజకీయంగా విజయ్ సాధించిన ఘనవిజయం ముందు అవన్నీ మరుగున పడిపోయాయి. భవిష్యత్తులో పాలనాపరంగా విజయ్ తన ముద్రను ఎలా చూపిస్తారో అన్నదే ఇప్పుడు అందరిలోనూ ఆసక్తి రేకెత్తిస్తోంది. మ‌రోవైపు విజ‌య్ కుమారుడు జాస‌న్ విజ‌య్ ప్ర‌స్తుతం ద‌ర్శ‌కుడిగా కెరీర్ ని నిర్మించుకోవాల‌ని క‌ల‌లు కంటున్న సంగ‌తి తెలిసిందే. అత‌డు త‌న తండ్రి ప్ర‌మాణ స్వీకారంలో క‌నిపించ‌క‌పోవ‌డం  స‌ర్వ‌త్రా ఆస‌క్తిక‌ర చ‌ర్చ‌కు దారి తీస్తోంది.

Vijay Takes Oath as Tamil Nadu CM — But Family's Absence