ప్రేమ ఎప్పుడు గంభీరంగానే ఉంటుంది - త్రిష

తమిళనాడు నూతన సీఎం విజయ్ కి నటి త్రిష కు మద్యన ఏమి నడుస్తుందో అనేది విజయ్ ప్రమాణ స్వీకార సమయంలో తేటతెల్లమైంది. విజయ్ లైఫ్ లోకి వచ్చిన త్రిష కు ఉన్న ఇంపార్టెన్స్ ఏమిటి అనేది విజయ్ ప్రమాణ స్వీకార సమయంలో స్పష్టతవచ్చేసింది. త్రిష విజయ్ ప్రమాణస్వీకార సమయంలో చక్కటి చీరకట్టులో అందరికి అభివాదం చేస్తూ హగ్ లు ఇచ్చుకుంటూ ఆయన భార్య స్థానంలో త్రిష ఉన్నట్టుగా కనిపించింది.

అయితే త్రిష విజయ్ ను ప్రేమిస్తుంది, విజయ్ తో అందుకే క్లోజ్ గా ఉంటుంది, త్వరలోనే వారు పెళ్లికి చేసుకుంటారనే ప్రచారం కి తోడు సంగీత విజయ్ కు విడాకులు ఇవ్వడం ఇవన్నీ తమిళ రాజకీయాల్లో ప్రకంపనలు సృష్టించినప్పటికీ విజయ్ ఫ్యాన్స్ విజయ్ నే సపోర్ట్ చేశారు. కాబట్టే ఆయన సీఎం అయ్యారు.

ఇక త్రిష విజయ్ ప్రమాణస్వీకారం తర్వాత మొదటిగా సోషల్ మీడియాలో ఓ పోస్ట్ పెట్టింది. ఆమె ఆ ఈవెంట్ సమయంలో కనిపించిన లుక్స్ ని షేర్ చేస్తూ ప్రేమ ఎప్పుడు గంభీరంగానే ఉంటుంది అంటూ సోషల్ మీడియాలో చేసిన ట్వీట్ చూసాక ఇక విజయ్-త్రిష సంబంధం పై ఎలాంటి అనుమానం లేదు, వారిద్దరూ త్వరలోనే ఒక్కటి కావడం అనేది పక్కా అంటూ నెటిజెన్స్ కామెంట్స్ పెడుతున్నారు. 

Love is always louder- Trisha shares first Instagram post after Vijay's swearing-in ceremonyLove is always louder - Trisha