హాలీవుడ్ దిగ్గజాల మధ్యలో ప్రభాస్ బరిలోకి!

రెబల్ స్టార్ ప్రభాస్ హీరోగా నాగ్ అశ్విన్ తెరకెక్కించిన విజువల్ వండర్ `కల్కి 2898 AD` సృష్టించిన సంచలనం తెలిసిందే. ఇప్పుడా చిత్రానికి భారీ సీక్వెల్ గా `కల్కి 2` తెరకెక్కుతోన్న సంగతి విధితమే. ఇప్పటికే రెగ్యులర్ షూటింగ్ మొదలు పెట్టిన చిత్రం గురించి ఓ ఇంట్రెస్టింగ్ అప్డేట్ అందుతోంది. ఈ ప్రతిష్టాత్మక చిత్రం 2027 డిసెంబర్లో ప్రేక్షకుల ముందుకు రాబోతుందని తెలిసింది. మొదటి భాగం ముగిసిన చోటు నుండే రెండో భాగం ప్రారంభం కానుందని సుప్రీమ్ యాస్కిన్ (కమల్ హాసన్) , భైరవ (ప్రభాస్), అశ్వత్థామ (అమితాబ్ బచ్చన్)ల మధ్య జరిగే అసలు యుద్ధం ఈ సీక్వెల్లో ప్రధాన ఆకర్షణ కానుందని తెలుస్తోంది.
బాక్సాఫీస్ వద్ద ఈ చిత్రం ఎదుర్కోబోయే పోటీ కూడా హాట్ టాపిక్‌గా మారింది. 2027 డిసెంబర్ నెలలో హాలీవుడ్ భారీ ప్రాజెక్టులైన `అవెంజర్స్: సీక్రెట్ వార్స్`, `ది లార్డ్ ఆఫ్ ది రింగ్స్: ది హంట్ ఫర్ గొల్లమ్` వంటి చిత్రాలు విడుదలకు రెడీ అవుతున్నాయి. వీటితో పాటు బాలీవుడ్ కల్ట్ హిట్ సీక్వెల్ `తుంబాడ్ 2` కూడా అదే సమయంలో వచ్చే అవకాశం రిలీజ్ కు ప్లాన్ చేస్తున్నారు. ఇలాంటి పోటీ నడుమ `కల్కి 2` అంతర్జాతీయ స్థాయిలో హాలీవుడ్ సూపర్ హీరోలతో తలపడటం భారతీయ సినీ ప్రేమికులకు గొప్ప అనుభూతిని అందించనుంది.
`కల్కి 2` 2027 ఏప్రిల్ నాటికి చిత్రీకరణ పూర్తవుతుందని సమాచారం. మిగిలిన సమయాన్ని విజువల్ ఎఫెక్ట్స్ కోసం కేటాయించాలని మేకర్స్ ప్లాన్ చేస్తున్నారు. వైజయంతీ మూవీస్ ఈ చిత్రాన్ని మొదటి భాగం కంటే రెట్టింపు స్థాయిలో నిర్మిస్తోంది. ఇప్పటికే అమితాబ్ బచ్చన్, కమల్ హాసన్ వంటి ఉద్దండులు షూటింగ్ లో జాయిన్ అవ్వడంతో భారీ అంచనాలు నెలకొన్నాయి. ఈసారి దేశీయంగానే కాకుండా అంతర్జాతీయ స్థాయిలో `కల్కి 2` కొత్త రికార్డులను సృష్టించడం ఖాయమని ట్రేడ్ అంచనా వేస్తోంది.








































