Loading...
ఆంగ్ల హోమ్ >> తెలుగు వార్తలు >> Trisha arrives at the residence of TVK chief Vijay

విజయ్ ఇంటికి త్రిష

Trisha arrives at the residence of TVK chief Vijay

తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల్లో విజయ్ పార్టీ విజయపథంలో దూసుకుపోతుంది. టీవీకే పార్టీ విజయ్ గెలుపు తథ్యంలా కనిపిస్తుంది. ప్రస్తుతం 110 స్థానాల్లో భారీ మెజారిటీతో విజయ్ పార్టీ దూసుకుపోతుంది. విజయ్ తో సన్నిహితంగా మెలుగుతోంది అనే రూమర్స్ నడుమ త్రిష అసెంబ్లీ ఎన్నికల ఫలితాల నేపథ్యంలో విజయ్ పార్టీకి అనుకూలంగా రావడంతో ఆమె చెన్నై లోని విజయ్ ఇంటికి వెళ్లి విజయ్ కి అభినందనలు తెలపడం హాట్ టాపిక్ అయ్యింది.
త్రిష వల్లే విజయ్ కి ఆయన భార్య సంగీత విజయ్ కి విడాకులు ఇస్తుంది అనే రూమర్స్ కి విజయ్-త్రిష ప్రతిసారి బలం చేకూరుస్తున్నారు. నేడు త్రిష బర్త్ డే. ఇక్కడ విజయ్ విజయం, అక్కడ త్రిష తిరుమల శ్రీవారి సేవలో తరించడమే కాదు, విజయ్ గెలుపు కోసం ఆమె తిరుమలలో ప్రత్యేక పూజలు నిర్వాహించినట్టుగా చెప్పుకుంటున్నారు.
అదే సమయంలో ఆమె తిరుమల నుంచి ప్రత్యేక ఫ్లైట్ లో చెన్నై చేరుకొని అటునుంచి అటే విజయ్ ఇంటికి చేరుకొని ఆమె విజయ్ కి అభినందనలు తెలిపినట్లుగా తెలుస్తుంది. సో ఇవన్నీ విజయ్-త్రిష నడుమ సమ్ థింగ్ సమ్ థింగ్ అనేలా కనిపిస్తున్నాయి.

Trisha prays for Vijay victory