Loading...

పైలట్ రోహిత్ రెడ్డి పై కేసీఆర్ ఆగ్రహం

KCR fires on Pilot Rohit Reddy

బీఆర్ఎస్ మాజీ ఎమ్యెల్యే పైలెట్ రోహిత్ రెడ్డి హైదరాబాద్ శివారులోని మొయినాబాద్ ఫామ్ హౌస్ లో నిర్వహించిన పార్టీ లో డ్రగ్స్ వినియోగం, ముఖ్యంగా గన్ ఫైరింగ్ అంశం తీవ్ర సంచలనం సృష్టించింది. ఈ పార్టీకి హాజరైన వారిలో టిడిపి ఏలూరు ఎంపీ పుట్టా మహేష్, ఇంకా చాలామంది ప్రముఖుల పేర్లు వెలుగులోకి వచ్చాయి.

పైలెట్ రోహిత్ రెడ్డి ఈ పార్టీలో మాదకద్రవ్యాలు తీసుకున్నట్టుగా టెస్ట్ లో పాజిటివ్ రావడంతో పోలీసులు దూకుడు పెంచారు. ఇప్పటికే టీడీపీ ఎంపీ పై పార్టీ అధ్యక్షుడు చంద్రబాబు సీరియస్ అయ్యారు. కేసు తేలేవరకు పార్టీ కార్యకలాపాలకు దూరంగా ఉండాలని ఆదేశించారు. ఇప్పుడు బీఆర్ఎస్ ఎమ్యెల్యే రోహిత్ రెడ్డిపై ఆ పార్టీ అధ్యక్షుడు కేసీఆర్ ఫైర్ అయ్యారు.

మాదక ద్రవ్యాల వినియోగం ఆరోపణలపై పైలట్ రోహిత్ రెడ్డికి  కేసీఆర్ షోకాజ్ నోటీసు జారీ చేసారు. వారం రోజుల్లోగా మీడియా ద్వారా వచ్చిన ఆరోపణలపై స్పష్టంగా లిఖితపూర్వక వివరణ ఇవ్వాలని ఆదేశించారు, షోకాజ్ నోటీసుకు గడువులోపు వివరణ ఇవ్వని పక్షంలో పైలెట్ రోహిత్ రెడ్డి పై పార్టీ నియమావళి ప్రకారం వేటు వేస్తారు అని తెలుస్తోంది. 

KCR Serious On Former MLA Pilot Rohit Reddy

rohit reddy