చరణ్ బర్త్ డే కు సకుమార్ ట్రీట్!
Ram Charan fans await birthday surprisesమెగా పవర్ స్టార్ రామ్ చరణ్ అభిమానులు ఎప్పుడెప్పుడా ఎదురుచూస్తున్న ఆర్సీ 17 ప్రకటనకు సమయం ఆసన్నమైనట్లు తెలుస్తోంది. గ్లోబల్ స్టార్‌గా ఎదిగిన చరణ్ - క్రియేటివ్ డైరెక్టర్ సుకుమార్ కలయికలో రాబోతున్న ఈ క్రేజీ ప్రాజెక్టుపై నెట్టింట ఆసక్తికర ప్రచారం సాగుతోంది. మార్చి 27న రామ్ చరణ్ పుట్టినరోజు కావడంతో ఆ రోజున సినిమాకు సంబంధించిన భారీ అప్‌డేట్‌ను ఇచ్చేందుకు సుకుమార్ బృందం రంగం సిద్ధం చేస్తున్నట్లు సమాచారం. `రంగస్థలం వంటి ఇండస్ట్రీ హిట్ తర్వాత వీరిద్దరి కాంబినేషన్ అనౌన్స్ కావడంతో అంచనాలు ఆకాశాన్నంటుతున్నాయి.
సుకుమార్ సన్నిహిత వర్గాల నుంచి అందుతున్న సమాచారం ప్రకారం ఈ అప్‌డేట్ కేవలం ఒక చిన్న ప్రకటనలా కాకుండా సినిమా మూడ్‌ను ఎలివేట్ చేసేలా ఒక పవర్‌ఫుల్ పోస్టర్ లేదా ఒక స్పెషల్ అనౌన్స్‌మెంట్ వీడియో రూపంలో ఉండబోతోందట. ప్రస్తుతం సుకుమార్ ఆ పనుల్లోనే బిజీగా ఉన్నట్లు వినిపిస్తోంది. రామ్ చరణ్ బర్త్ డే కానుకగా అభిమానులను ఖుషీ చేసేందుకు ప్రత్యేకంగా సమయం కేటాయించినట్లు తెలుస్తోంది. ఈ సినిమా కథా నేపథ్యం కూడా మునుపెన్నడూ చూడని విధంగా ఉంటుందని, ఒక కొత్త ప్రపంచాన్ని సుకుమార్ ఈ చిత్రంతో పరిచయం చేయబోతున్నారని టాక్ వినిపిస్తోంది.
ప్రస్తుతం రామ్ చరణ్బు బుచ్చిబాబు సానా దర్శకత్వంలో తెరకెక్కుతోన్న `పెద్ది`ముగింపు పనుల్లో బిజీగా ఉన్నారు. అవి పూర్తయిన తర్వాత సుకుమార్ ప్రాజెక్ట్ పట్టాలెక్కనుంది. అయినప్పటికీ పుట్టినరోజున ఈ ప్రాజెక్ట్ గురించి వచ్చే అధికారిక అప్‌డేట్ మెగా ఫ్యాన్స్‌కు అసలైన కిక్ ఇవ్వనుంది. ముఖ్యంగా సుకుమార్ శైలికి తగ్గట్టుగా చరణ్ క్యారెక్టరైజేషన్ చాలా విభిన్నంగా? రస్టిక్ అండ్ రా లుక్‌లో ఉంటుందని సినీ సర్కిల్స్‌లో గుసగుసలు వినిపిస్తున్నాయి. అలాగే పెద్ది కి సంబంధించిన కీలక సమాచారం కూడా బయటకు వచ్చే అవకాశం ఉంది.
Sukumar Plans Huge Birthday Gift For Ram Charan







































