ఉస్తాద్ పై కుండ బద్దలు కొట్టిన హరీష్ శంకర్
UBS is not a Remake - Harish Shankarఇప్పటివరకు పవన్ కళ్యాణ్ తో హరీష్ శంకర్ తెరకెక్కిస్తున్న ఉస్తాద్ భగత్ సింగ్ కోలీవుడ్ హీరో విజయ్ నటించిన తేరి రీమేక్ అని పవన్ ఫ్యాన్స్ కామన్ ఆడియన్స్ కూడా ఫిక్స్ అయ్యారు. పవన్ కళ్యాణ్ లుక్, తేరి మాదిరి ఇద్దరు హీరోయిన్స్, పవన్ పోలీస్ ఆఫీసర్ గా కనిపించడం ఇవన్నీ తేరి రీమేక్ అనుకునేలా చేసాయి.
అందుకే హరీష్ శంక రేణు పవన్ ఫ్యాన్స్ ట్రోల్స్ చేసారు. అయినా హరీష్ శంకర్ పవన్ ఫ్యాన్స్ కి ధీటుగా జవాబు చెప్పడమే కాదు పవర్ ఫుల్ కంటెంట్ వదిలి కూల్ చేస్తున్నాడు. అయితే ఉస్తాద్ భగత్ సింగ్ తేరి రీమేక్ కాదు అని ఎంతమంది చెప్పినా చాలామందికి ఆ అపోహలు వదల్లేదు. తాజాగా హరీష్ శంకర్ ఆ అపోహలను వదలగొట్టేసాడు.
అప్పట్లో గబ్బర్ సింగ్ విషయంలో నేను మార్పులు చేసి క్రెడిట్స్ తీసుకున్నాను. కానీ ఉస్తాద్ భగత్ సింగ్ కు స్టోరీ, స్క్రీన్‌ప్లే, డైలాగ్స్ నేనే రాశాను. అదే టైటిల్స్ లో వేసుకున్నాను. తమిళ తేరి లోని కొన్ని ఎపిసోడ్‌లు నా గబ్బర్ సింగ్ నుంచి ప్రేరణ పొందాయి. అలాంటి సినిమాను నేనెందుకు రీమేక్ చేస్తాను.. అంటూ కుండబద్దలు కొట్టారు.
Ustaad Bhagat Singh NOT a Remake - Harish Shankar







































