బాలయ్య కి విలన్ ని ప్రిఫర్ చేస్తున్న ఫ్యాన్స్
Fans preferring a villain to Balayyaనందమూరి నటసింహ బాలకృష్ణ అఖండ 2 చిత్రంలో తమిళ హీరో ఆది పినిశెట్టి తో తలపడ్డారు. ఆది పినిశెట్టి పవర్ ఫుల్ విలన్ గా కనిపించినా ఆయన బాలయ్య ముందు తేలిపోయారు. అంతముందు గోపీచంద్ మలినేని దర్శకత్వంలో బాలయ్య చేసిన వీర సింహ రెడ్డి చిత్రంలోనూ బాలయ్య ముందు విలన్ పాత్రధారి తేలిపోయాడు.
ఇప్పుడు బాలయ్య మరోసారి గోపీచంద్ మలినేని తో మూవీ స్టార్ట్ చేస్తున్నారు. ప్రస్తుతం ప్రీ ప్రొడక్షన్ పనుల్లో ఉన్న NBK 111 ప్రాజెక్ట్ మార్చ్ సెకండ్ వీక్ నుంచి స్టార్ట్ కానుంది. పవర్ ఫుల్ యాక్షన్, కమర్షియల్ చిత్రంగా NBK 111 ఉండబోతుంది అంటూ గోపీచంద్ మలినేని ఈప్రాజెక్టు ఫై అంచనాలు పెంచేశారు.
అయితే గోపీచంద్ మలినేని కి నందమూరి ఫ్యాన్స్ ఓ సలహా ఇస్తున్నారు. బాలయ్య ఆహార్యానికి, మాస్ కటౌట్ కి సరిపోయే విలన్ మలయాళ స్టార్ జాజు జార్జ్ అయితే బావుంటుంది, బాలయ్య కు అపోజిట్ విలన్ గా సరిగ్గా సరిపోతాడు, ఏ మాత్రం ఛాన్స్ ఉన్నా జోజు జార్జ్ ని NBK 111 లో పెట్టు అంటూ గోపీచంద్ మలినేని కి విలన్ విషయంలో సలహాలిస్తున్నారు.
మరి NBK 111 చిత్రంలో బాలయ్య కు ఎలాంటి విలన్ సెట్ అవుతాడో.. ఆ విషయంలో గోపీచంద్ మలినేని ఆలోచన ఎలా ఉందొ చూద్దాం.
Balakrishna NBK 111






































