వైరల్ - శ్రీలీల క్యూట్ లుక్
Sreeleela looked absolutely mesmerizingటాలీవుడ్ నుంచి విజయాలు ఆశించి భంగపడిన క్యూట్ బ్యూటీ శ్రీలీల కు ఇక్కడ ఆశించిన ఫలితం దక్కలేదు కానీ అమ్మడుకి అటు బాలీవుడ్ ఇటు కోలీవుడ్ అవకాశాలు మాత్రం ఊపిరి సలపకుండా చేస్తున్నాయి. బాలీవుడ్ లో ఒక్క సినిమా కూడా విడుదల కాలేదు. కానీ అక్కడ అవకాశాల మీద అవకాశాలు.
ఇక కోలీవుడ్ లో ఫస్ట్ డెబ్యూ మూవీ పరాశక్తి.. ఆ చిత్రం శ్రీలీల కు గట్టి షాక్ ఇచ్చింది. ఆ చిత్రం తర్వాత శ్రీలీల పేరు పెద్దగా తమిళనాట వినిపించదు అనుకుంటే.. వెంటనే ఇద్దరు ముగ్గురు స్టార్ హీరోల సినిమాల్లో ఆఫర్స్ వెల్లువలా వచ్చిపడ్డాయి. అందులో ధనుష్ D55, ధృవ్ విక్రమ్ తో ఓ చిత్రం.
అన్నిటికన్నా ముఖ్యంగా అజిత్ కుమార్ సినిమాలో శ్రీలీలకు ఆఫర్ వచ్చింది అనే న్యూస్ ఆమెపై క్రేజ్ పెరిగేలా చేసింది. సోషల్ మీడియాలో ఎప్పుడు యాక్టీవ్ గా ఉండే శ్రీలీల తాజాగా వదిలిన పిక్స్ మాత్రం వైరల్ అవుతూనే ఉన్నాయి. ఇప్పుడు కూడా ఎల్లో టాప్ చిన్నపాటి షాట్ తో క్యూట్ గా కనిపించింది. ప్రస్తుతం శ్రీలీల లేటెస్ట్ లుక్ నెట్టింట్లో చక్కర్లు కొడుతోంది.
Sreeleela looked absolutely mesmerizing







































