అక్క‌డా దీపికా ప‌దుకొణే అదే తీరు

Deepika Padukone leaves White Lotus

బాలీవుడ్ హీరోయిన్ దీపికా ప‌దుకొణే తెలుగులో ఎలాంటి అవ‌కాశాలు వ‌దిలే సుకుందో తెలిసిందే. తొలుత `క‌ల్కి 2` నుంచి నిష్క్ర‌మించ‌డం... అటుపై `స్పిరిట్` నుంచి త‌ప్పుకోవ‌డంతో? అమ్మ‌డి పేరు నెట్టింట ఓ సంచ‌ల‌నంగా మారిం ది. ఇలా రెండు పాన్ ఇండియా ప్రాజెక్ట్ లు వ‌దుల‌కోవ‌డం వెనుక కార‌ణాలు అనేకం అయి నా?  దీపిక మాత్రం ఈ రెండు సినిమాల్ని ఎంత మాత్రం ప‌ట్టించుకోల‌ద‌న్న‌ది వాస్త‌వం.

ఆ రెండు సినిమాల‌కు వ‌చ్చే భారీ పారితోషికం కంటే?  త‌న వ్య‌క్తిత్వ‌మే ముఖ్య‌మ‌ని న‌మ్మి వ‌దిలేసింది. ఈ కార‌ణంగా ఎన్నో విమ‌ర్శ‌ల‌కు గురైంది. ఈ విష‌యంలో దీపిక  ఎంత మాత్రం వెన‌క్కి త‌గ్గ‌లేదు. త‌న మాట మాత్ర‌మే నెగ్గించు కోవాల‌ని ముందుకెళ్లింది. అన్న‌ట్లుగానే స‌క్సెస్ అయింది. తాజాగా త‌న‌తో తేడా వ‌స్తే హాలీవుడ్ అయినా త‌గ్గేదేలే అన్న‌ట్లు క‌నిపిస్తోంది.

హాలీవుడ్ లో ఎంతో పాపుల‌ర్ అయిన ‘ది వైట్ లోటస్’ సిరీస్ 4వ సీజన్ కోసం దీపికా పదుకొనే పేరును ప‌రిశీ లించారుట‌. నేరుగా ఆమెను కూడా క్రియేటివ్ టీమ్ అప్రోచ్ అయిందిట‌. పాత్ర‌కు ప‌ర్పెక్ట్ గా సెట్ అవుతు న్నార‌ని..ఎంపిక అయ్యే అవ‌కాశాలుఎ క్కువ‌గా ఉన్నాయ‌ని చెప్పారుట‌. అందుకు దీపిక కూడా సంతోషంగా వ్య‌క్తం చేసిం దిట‌.  కానీ ఏం జ‌రిగిందో? ఏమోగానీ అంతలోనే ఆడిష‌న్ కు మాత్రం రాన‌ని చెప్పేసింద‌ని ఓ వార్త నెట్టింట వైర‌ల్ అవుతోంది. రెండు..మూడు రోజులు వెయిట్ చేసిన టీమ్ తాజాగా ఆమె స్థానంలో మరో నటిని తీసుకునేందుకు  టీమ్ రెడీ అయింది.

Deepika Padukone walks out of another project

deepika padukone