స్పిరిట్ - ప్రభాస్ కి ఎదురొచ్చే విలన్ ఎంట్రీ

Vivek Oberoi look from Spirit out

కల్ట్ దర్శకుడు సందీప్ రెడ్డి వంగ దర్శకత్వంలో పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ నటిస్తున్న స్పిరిట్ చిత్ర షూటింగ్ కి సందీప్ వంగ చిన్న బ్రేకిచ్చారు. తన ఫస్ట్ హీరో విజయ్ దేవరకొండ-రష్మీకల వివాహం కోసం రాజస్థాన్ ఉదయపూర్ వెళ్లొచ్చారు. ఈరోజు శుక్రవారం సందీప్ వంగ తిరిగి హైదరాబాద్ చేసుకుంటూనే ప్రభాస్ ఫ్యాన్స్ కోసం సూపర్ ట్రీట్ ఇచ్చారు.

ఎప్పుడో డిసెంబర్ లోనే ప్రభాస్ ఇంకా హీరోయిన్ త్రిప్తి డుమ్రి ల ఫస్ట్ లుక్ రివీల్ చేసిన సందీప్ వంగ ఇప్పుడు ప్రభాస్ ని ఢీ కొట్టబోయే విలన్ ను పరిచయం చేశారు. ప్రభాస్ ని ఎదుర్కోబోయే విలన్ గా బాలీవుడ్ నటుడు వివేక్ ఒబెరాయ్ ఎంట్రీ లుక్ అద్దిరిపోయింది. నోట్లో సిగార్, చేతిలో కట్టి పట్టుకొని పవర్ ఫుల్ గా ఉన్న వివేక్ ఒబెరాయ్ స్పిరిట్ లుక్ నెక్స్ట్ లెవల్లో ఉంది.

ఊహించకుండా సడన్ గా వచ్చిన స్పిరిట్ సర్ ప్రైజ్ తో ప్రభాస్ ఫ్యాన్స్ ఎంతగా సంబరపడిపోతున్నారో మాటల్లో వర్ణించలేం. మార్చ్ 5, 2027 న స్పిరిట్ సినిమా పాన్ ఇండియా ప్రేక్షకుల ముందుకు రానుంది.

Spirit - Vivek Oberoi makes a style statement

spirit