ఆంగ్ల హోమ్ >> తెలుగు వార్తలు >> Vijay Devarakonda-Rashmika wedding update

ఉదయపూర్ చేరుకుంటున్న సెలబ్రిటీస్

Vijay Devarakonda-Rashmika wedding update

టాలీవుడ్ సెలబ్రిటీస్ ముఖ్యంగా విజయ్ దేవరకొండ-రష్మిక మందన్న కు దగ్గరివారు, ఒక్కొక్కరిగా రాజస్థాన్ ఉదయపూర్ చేరుకుంటున్నారు. ఇప్పటికే విజయ్ దేవరకొండ-రష్మిక తమ తమ ఫ్యామిలీస్ తో కలిసి ఉదయపూర్ కి చేరుకున్నారు. పెళ్లి చూపులు సినిమాతో కలిసి పని చేసిన దర్శకుడు తరుణ్ భాస్కర్, ఈషా రెబ్బ లు కూడా ఈరోజు ఉదయపూర్ పయనమయ్యారు.

రాజస్థాన్ ఉదయపూర్ ప్యాలెస్ లో విజయ్ దేవరకొండ-రష్మిక ల వివాహం ఈ నెల 26 న జరగబోతుంది. పెళ్ళికి కేవలం కుటుంబ  సభ్యులు, సన్నిహితులు, కొద్దిమంది స్నేహితులు మాత్రమే హాజరవుతారని  తెలుస్తుంది. ఈరోజు, రేపు జరగబోయే మెహిందీ, హల్దీ సెర్మోని లో విజయ్-రష్మికలు పాల్గొంటున్నారు.

ఫిబ్రవరి 26 న అంగరంగ వైభవంగా వివాహం చేసుకోబోతున్న Virosh జంట హైదరాబాద్ తాజ్ కృష్ణ లో మార్చ్ 4 న వివాహ రిసెప్షన్ ని ఏర్పాటు చేసారు. ఈ వేడుకకి సినీ, రాజకీయప్రముఖులు హాజరవుతారని తెలుస్తుంది. 

Vijay Devarakonda-Rashmika wedding news

vijay devarakonda