ఆంగ్ల హోమ్ >> తెలుగు వార్తలు >> Bandla Ganesh Pilgrimage From Shadnagar To Tirumala

అభిమానము - భక్తి రెండూ నడిపించాయి

Bandla Ganesh Pilgrimage From Shadnagar To Tirumala

ప్రముఖ నిర్మాత, నటుడు బండ్ల గణేష్ చేపట్టిన సంకల్పయాత్ర తుది దశకు చేరుకుంది. షాద్ నగర్ లోని తన నివాసం నుంచి జనవరి 19 న కాలినడకన మొదలు పెట్టిన సంకల్ప యాత్ర నిన్నటికి అలిపిరి కి చేరుకొని.. ఈరోజు మెట్ల మార్గం ద్వారా నడుస్తూ.. రేపు ఉదయం విఐపి బ్రేక్ దర్శనంలో శ్రీవారిని దర్శించుకోనున్నారు బండ్ల గణేష్. 

హైదరాబాద్ లోని షాద్‌నగర్‌ నివాసం నుంచి మొదలైన బండ్ల గణేష్ సంకల్ప యాత్ర సుమారు 507 కిలోమీటర్లు సాగి సోమవారం అలిపిరి కి చేరింది. బండ్ల గణేష్ పాదయాత్రలో ఆయన అభిమానులు, సినీ, రాజకీయ ప్రముఖులు అవకాశం ఉన్న చోట జాయిన్ అయ్యారు. పలు ప్రదేశాల్లో విడిది చేస్తూ బండ్ల గణేష్ తన సంకల్ప యాత్రను ముగించారు.

అసలు బండ్ల ఈ యాత్రను మొదలు పెట్టడానికి కారణం ఏపీ ప్రస్తుత ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, ఆయన మాజీ సీఎం స్థానంలో ఉండగా వైసీపీ ఆయన్ని స్కిల్స్ కేసులో అరెస్ట్ చేసి జైలులో పెట్టింది. అప్పుడు చంద్రబాబు సురక్షితంగా జైలు నుంచి బయటకు రావాలని బండ్ల గణేష్ ఈ సంకల్ప యాత్ర ను మొక్కుని దానిని ఇప్పుడు దిగ్విజయంగా పూర్తి చేశారు. 

చంద్రబాబు నాయుడు గారు సురక్షితంగా జైలు నుంచి బయటకు వస్తే కాలినడకన శ్రీవారి దర్శనానికి వస్తాను అని మొక్కుకున్నట్లుగా, అప్పుడే నా గడప నుంచి వెంకన్న గడప వరకూ నడిచి వస్తానని ప్రార్థించాను. వేంకటేశ్వరుడి దయ, కృపతో నా సంకల్పం నెరవేరింది అంటూ బండ్ల గణేష్ చెప్పుకొచ్చారు. 

Producer Bandla Ganesh Sankalpa Yatra Latest Update

bandla ganesh