2027 సంక్రాంతికి చిరు-బాబీ ఫిక్స్

Mega 158 fix for Sankranti releaseMega 158 fix for Sankranti release

మెగాస్టార్ చిరు ప్రస్తుతం మన శంకర వరప్రసాద్ గారు సక్సెస్ తో జోష్ లో ఉండడమే కాదు.. మెగాస్టార్ కి వారసుడు రాక మరింత సంతోషాన్నిచింది. కొడుకు రామ్ చరణ్- కోడలు ఉపాసన జంట కవలల జన్మనిచ్చారు. అందులో బాబు, తర్వాత పాప జన్మించడంతో మెగా ఫ్యామిలీ సంతోషంతో ఉక్కిరి బిక్కిరి అవుతుంటే.. మెగా ఫ్యాన్స్ సంతోషంతో ఉప్పొంగిపోయారు.

అదే సమయంలో చిరు-బాబీ కలయికలో మొదలు కాబోయే మెగా 158 మూవీ పై ఓ న్యూస్ సోషల్ మీడియాలో హైలెట్ అవుతోంది. ఈ చిత్రాన్ని మార్చ్ నుంచి స్టార్ట్ చేసి వచ్చే ఏడాది అంటే 2027 సంక్రాంతి సీజన్ లో విడుదల చేసే ప్లాన్ చెయ్యడం కాదు సంక్రాంతి సీజన్ లో పక్కాగా మెగా 158 ని దించుచుతారనే న్యూస్ వైరల్ అవుతోంది.

ఈ ఏడాది జూన్ లేదా జులై లో విశ్వంభర విడుదల కానుంది, మరో ఆరు నెలలకు బాబీ దర్శకత్వంలో చిరు చెయ్యబోయే మెగా 158 విడుదల.. మరి ఇలా అయితే మెగా ఫ్యాన్స్ కి సంతోషం కాక ఇంకేముంటుంది. ఈ చిత్రంలో చిరు కి జోడిగా దర్శకుడు బాబీ ప్రియమణి ని ఎంపిక చేశారనే టాక్ నడుస్తుంది. 

Mega 158 update

mega 158