ఇందుకే తనూజా నిన్ను ఆరాధించేది

Thanuja new look viralThanuja new look viral

బిగ్ బాస్ సీజన్ 9 రన్నర్ తనూజ ను ఆమె అభిమానులు హౌస్ లో ఎంతగా ఆరాధించారో అందరూ చూసారు. ఆమె విన్నర్ అవ్వాలని బుల్లితెర ప్రేక్షకులు చాలా కోరుకున్నారు. కానీ తనూజ రన్నర్ తో బిగ్ బాస్ హౌస్ నుంచి బయటికొచ్చింది. ఇక బయటికొచ్చాక తనూజ చాలా లో ప్రొఫైల్ మైంటైన్ చేస్తుంది.

ఆ విషయంలో తనూజ అభిమానులు హార్ట్ అవుతున్నారు. అయినా తనూజ మాత్రం చాలా ఆచి తన ఫొటోస్ ని షేర్ చేస్తుంది. అలాగే సోషల్ మీడియాలోనూ తక్కువగానే కనిపిస్తుంది. బిగ్ బాస్ హౌస్ లో ఆమె డ్రెస్సింగ్ స్టయిల్ ని ఇష్టపడిన ఫ్యాన్స్ బయటికొచ్చాక కూడా తనూజ అలానే ట్రెడిషనల్ గా కనిపించి వాళ్ళని సర్ ప్రైజ్ చేస్తూ వస్తుంది.

తాజాగా ఆమె హైదరాబాద్ లోని ఓ జ్యువెలరీ షాప్ ఓపినింగ్ కి వెళ్ళింది. అక్కడికి ఆమె చక్కటి చీరకట్టులో వెళ్ళింది, అంతేకాదు ఆమె శారీ ఫోటో షూట్ ని సోషల్ మీడియాలో షేర్ చేసింది. ఆ పిక్స్ చూసి ఇందుకే తనూజ నిన్ను అంతగా ఆరాధించేది అంటూ తనూజ ఫ్యాన్స్ కామెంట్స్ పెడుతున్నారు. 

Thanuja Puttaswamy Latest Saree Look

thanuja