ఫ్యాన్స్ ని వార్న్ చేస్తున్న రకుల్ ప్రీత్

Rakul Preet Singh Warns Fans

ఈ మధ్యన సైబర్ నేరగాళ్లు రెచ్చిపోతున్నారు. సామాన్య ప్రజల నుంచి సినీ, రాజకీయ సెలబ్రిటీస్ వరకు వారి వ్యక్తిగత ఫోన్ నెంబర్లను ఉపయోగించి నేరాలకు పాల్పడుతున్నారు. ఈమధ్యన చాలామంది హీరోయిన్స్ తమ వాట్సాప్ నుంచి ఫేక్ మెసేజ్ లు వస్తున్నాయి. నకిలీ వాట్సాప్ ఖాతా సృష్టించి మోసాలకు పాల్పడుతున్నారని తమ తమ అభిమానులను వార్న్ చేస్తున్నారు. 

రీసెంట్ గా అదితి రావు అలానే తన ఫోన్ కి నకిలీ వాట్సాప్ సృష్టించి నేరగాళ్లు మోసాలు చేస్తున్నారు, తన నెంబర్ నుంచి ఎలాంటి మెసేజ్ వచ్చినా అప్రమత్తంగా ఉండాలని చెప్పింది. తాజాగా ఆ లిస్ట్ లోకి రకుల్ ప్రీత్ చేరింది. 8111067586 అనే ఫోన్ నంబర్‌కు తన ఫొటోను డీపీగా పెట్టి, బయోలో తాను నటించిన సినిమాల పేర్లను రాసి.. కొంతమంది నా పేరు మీద మెసేజెస్ పంపుతున్నట్లు గా నా దృష్టికి వచ్చింది.  

దానితో ఆమె తన ఫ్యాన్స్ ను అప్రమత్తం చేస్తూ.. నా పేరుతో ఎవరో వాట్సాప్‌లో ప్రజలకు సందేశాలు పంపుతున్నారు. దయచేసి ఆ నంబర్‌కు స్పందించకండి. అది నాది కాదు జాగ్రత్తగా ఉండమంటూ ఆమె సోషల్ మీడియా వేదికగా అభిమానులను వార్న్ చేసింది. 

Rakul Preet Singh Warns Fans About WhatsApp Impersonator Using

rakul preet