Loading...

గుడ్ బ్యాడ్ అగ్లీ ఓటీటీ డేట్ ఫిక్స్

Good Bad Ugly OTT Release Date

అజిత్ కుమార్-త్రిష జంటగా కోలీవుడ్లో తెలుగు నిర్మాతలు మైత్రి మూవీస్ వారు తెరకెక్కించిన గుడ్ బ్యాడ్ అగ్లీ తమిళనాట పెద్ద హిట్ అయ్యింది. అజిత్ యాక్షన్ కి తమిళ తంబీలు ఫిదా అయ్యారు. గుడ్ బ్యాడ్ అగ్లీ తమిళనాట 200 కోట్లు పైనే కొల్లగొట్టింది. గుడ్ బ్యాడ్ అగ్లీ మిగతా లాంగ్వేజెస్ లో అంతగా ప్రభావం చూపలేకపోయింది. 

థియేటర్స్ లో బిగ్ హిట్ అయిన గుడ్ బ్యాడ్ అగ్లీ ఓటీటీ స్ట్రీమింగ్ రైట్స్ ని ప్రముఖ ఓటీటీ సంస్థ నెట్ ఫ్లిక్స్ ఫ్యాన్సీ డీల్ తో సొంతం చేసుకుంది. అధిక్ రవిచంద్రన్ డైరెక్ట్ చేసిన గుడ్ బ్యాడ్ అగ్లి చిత్రం ఇప్పుడు ఓటీటీ స్ట్రీమింగ్ కి రెడీ అయ్యింది. 

మే 9 నుంచి నెట్ ఫ్లిక్స్ లో అజిత్ గుడ్ బ్యాడ్ అగ్లీ ని స్ట్రీమింగ్ చేస్తున్నట్టుగా మేకర్స్ ప్రకటించారు. మరి థియేటర్స్ లో మిస్ అయిన పద్మభూషణ్ అజిత్ గుడ్ బ్యాడ్ అగ్లిని నెట్ ఫ్లిక్స్ లో వీక్షించేందుకు రెడీ అవ్వాల్సిందే. 

Ajith Kumar Good Bad Ugly Locks Date For OTT

good bad ugly