కోలుకున్న పవన్ కొడుకు - మెగాస్టార్ ట్వీట్
Pawan son recovers - Megastar tweetపవన్ కళ్యాణ్ చిన్న కొడుకు మార్క్ శంకర్ సింగపూర్ లోని ఓ స్కూల్ లో అగ్ని ప్రమాదానికి గురై సింగపూర్ లోని ప్రవేట్ ఆసుపత్రి లో చికిత్స పొందుతూ నేడు క్షేమంగా ఇంటికి చేరినట్లుగా మెగాస్టార్ చిరంజీవి మార్క్ శంకర్ హెల్త్ పై బిగ్ అప్ డేట్ ఇచ్చారు.
మా బిడ్డ మార్క్ శంకర్ ఇంటికొచ్చేసాడు. అయితే ఇంకా కోలుకోవాలి. మా కులదైవమైన ఆంజనేయ స్వామి దయతో, కృపతో త్వరలోనే పూర్తి ఆరోగ్యంతో, మళ్ళీ మామూలుగా ఎప్పటిలానే వుంటాడు.
రేపు హనుమత్ జయంతి, ఆ స్వామి ఓ పెద్ద ప్రమాదం నుంచి, ఓ విషాదం నుంచి ఆ పసి బిడ్డని కాపాడి మాకు అండగా నిలిచాడు.
ఈ సందర్భంగా ఆయా ఊళ్ళల్లో, ఆయా ప్రాంతాల్లో మార్క్ శంకర్ కోలుకోవాలని ప్రతి ఒక్కరూ మా కుటుంబానికి అండగా నిలబడి ఆ బిడ్డ కోసం ప్రార్థనలు చేస్తున్నారు, ఆశీస్సులు అందచేస్తున్నారు.
నా తరపున, తమ్ముడు కళ్యాణ్ బాబు తరపున, మా కుటుంబం యావన్మంది తరపున మీ అందరికీ ధన్యవాదాలు తెలియచేస్తున్నాం.. అంటూ చిరు ట్వీట్ చేశారు.
Chiranjeevi on Pawan Kalyan son Mark Shankar health update







































