ఆంగ్ల హోమ్ >> తెలుగు వార్తలు >> Ultimatum of TDP leaders to leadership

అధిష్టానానికి టీడీపీ నేతల అల్టిమేటం

Ultimatum of TDP leaders to leadership

చాలామంది వైసీపీ నేతలు 2024 ఎన్నికలకు ముందే టీడీపీ లో చేరి అక్కడ గెలిచి మంత్రి పదవులు అనుభవిస్తున్నారు. ఎన్నికల్లో కూటమి ప్రభుత్వం గెలిచిన తర్వాత వైసీపీ లో మరికొందరు టీడీపీలో, జనసేన పార్టీలో చేరిపోయారు. తమకు అవసరం ఉన్నవారికి పదవుల ఆశచూపి పార్టీలో చేర్చుకుంటే కొంతమంది మాత్రం పదవిలేకపోయినా అధికార పార్టీలో ఉంటే చాలనుకున్నారు. 

ఇదేమి కొత్త కాదు, టీడీపీ ప్రభుత్వం ఓడిపోయాక వైసీపీ ప్రభుత్వంలోకి టీడీపీ వారు చాలామందే వెళ్లారు. అసలు టీడీపీ పార్టీనే సర్వనాశనం చెయ్యాలని అప్పట్లో జగన్ చూసాడు కూడా. ఇప్పుడు అదే గతి వైసీపీ కి పట్టేట్టు ఉంది. వైసీపీ నుంచి చాలామంది టీడీపీ లో చేరిపోయారు. వారికీ అధికారం ముఖ్యం. నీతి-నిజాయితీ అనేవి రాజకీయాల్లో ఏమి ఉండవు. ప్రజలు కూడా వాళ్లనే నమ్మి ఓట్లేస్తారు. 

అయితే టీడీపీ పార్టీలోకి వచ్చేవారికి, వారిని చేర్చుకుని పదవులు ఇచ్చే అధిష్టానానికి టీడీపీ నేతలు అల్టిమేటం జారీ చేస్తున్నారు. విజయ సాయి రెడ్డి రాజీనామా తర్వాత వైసీపీ నుంచి మరికొందరు రాజీనామా చేసి టీడీపీ పార్టీలో జాయిన్ అవ్వబోతున్నారనే వార్తల నేపథ్యంలో టీడీపీ నేత గోరంట్ల బుచ్చయ్య చౌదరి చేసిన వ్యాఖ్యలు వైరల్ అవుతున్నాయి.  

మా పార్టీ అధిష్టానానికి కూడా చెప్తున్నాం, ఎవరినైనా పార్టీ లోకి చేర్చుకుంటున్నప్పుడు ఒకటికి రెండు సార్లు ఆలోచించండి. టీడీపీలో కార్యకరథలకు తగిన గౌరవం ఉండాలి. పార్టీ కి కింద నుండి పని చేసే కార్యకర్తకే గౌరవం ఉండాలే కానీ, అయా రావ్ గయా రావ్ లు కాదని మేం స్పష్టం చేస్తున్నాం. ఆ విధంగా వచ్చిన వాళ్ళు పబ్బం గడుపుకుంటారు, అధికారం పోయినప్పుడు మళ్ళీ పార్టీలు మారతారు.. వాళ్లకు రెడ్ కార్పెట్ పరిచి కార్యకర్తలను తీసిపడేస్తే ఊరుకోమంటూ బుచ్చయ్య చౌదరి డైరెక్ట్ గా అధిష్టానానికే వార్నింగ్ ఇచ్చారు. 

Gorantla Butchaiah Chowdary

gorantla butchaiah chowdary