Advertisement

తన భార్యతో తండేల్ రాజు విహారం

Akkineni is a new couple in Maldives

అక్కినేని యువ హీరో నాగ చైతన్య హీరోయిన్ శోభిత దూళిపాళ్లను డిసెంబర్ 5 న పెద్దల అంగీకారంతో అన్నపూర్ణ స్టూడియోస్ లో ఫ్యామిలీ మెంబెర్స్, స్నేహితులు, సన్నిహితుల నడుమ అంగరంగ వైభవముగా వివాహం చేసుకున్న విషయం తెలిసిందే. పెళ్లి తర్వాత ఈ జంట ఏ హనీమూన్ కో ఎగిరిపోతుంది అని అందరూ భావించారు. కానీ చైతు, శోభిత ఇద్దరూ తమ తమ పనుల్లో నిమగమయ్యారు. 

రీసెంట్ గా సంక్రాంతి పండుగను ఈ కొత్త జంట సాంప్రదాయ పద్ధతిలో చేసుకుంది. తాజాగా నాగ చైతన్య-శోభిత ఇద్దరూ హానీమూన్ కి వెళ్లిపోయారు. మాల్దీవుల్లో అక్కినేని కొత్త జంట కనిపించడంతో వీరు ఇలా హనీమూన్ ట్రిప్ ప్లాన్ చేసుకున్నారని అంటున్నారు. కొద్దిరోజులు అక్కడే ఉంది.. ఆ తర్వాత తిరిగి హైదరాబాద్ వస్తారని తెలుస్తోంది. 

నాగ చైతన్య నటించిన తండేల్ చిత్రం ఫిబ్రవరి 7 న విడుదల కాబోతుంది. చైతు హనీమూన్ నుంచి వచ్చాక తండేల్ ప్రమోషన్స్ స్టార్ట్ చేస్తారని తెలుస్తుంది. శోభిత దూళిపాళ్ల హాలివుడ్ నుంచి బాలీవుడ్ ప్రాజెక్ట్స్ తో బిజీగా కనబడుతుంది. 

Naga Chaitanya first honeymoon with Sobhita Dhulipala in Maldives

naga chaitanya