దేవర విలన్ కు కత్తిపోట్లు
Saif Ali Khan stabbedగ్లోబల్ స్టార్ ఎన్టీఆర్-కొరటాల కలయికలో తెరకెక్కిన దేవర చిత్రంలో పవర్ ఫుల్ విలన్ గా నటించిన బాలీవుడ్ స్టార్ సైఫ్ అలీ ఖాన్ కు కత్తిపోట్లు, అతని ఇంట్లోనే దొంగ దాడి అనే వార్త వినగానే ఆయన అభిమానుల్లో తీవ్ర ఆందోళన మొదలయ్యింది. కత్తిపోట్ల కి గాయపడిన సైఫ్ అలీ ఖాన్ని ముంబై లోని లీలావతి ఆసుపత్రికి తరలించినట్లుగా తెలుస్తోంది.
గురువారం తెల్లవారు ఝామున సైఫ్ అలీ ఖాన్ ఇంట్లోకి దొంగ ప్రవేశించాడని, అతన్ని అడ్డుకున్న సైఫ్ అలీ ఖాన్ మీద ఆ దొంగ దాడి చేశాడని, సైఫ్ శరీరంపై చాలా గాయాలు అయ్యాయని, రెండు చోట్ల కత్తి పోట్లు తగిలాయంటూ వార్తలు వినిపిస్తున్నాయి. తీవ్ర గాయాల పాలైన సైఫ్ ని ఫ్యామిలీ మెంబెర్స్ ముంబైలోని లీలావతి ఆసుపత్రికి తరలించారు.
లీలావతి హాస్పిటల్లో ప్రస్తుతం సైఫ్ అలీ ఖాన్‌కు చికిత్స జరుగుతోంది. సైఫ్ కి దొంగ దాడి లో రెండు గాయాలు చాలా లోతుగా అయ్యాయి.. ఒకటి ఆయన వెన్నుమొకకు దగ్గరగా జరిగింది అంటున్నారు. ఈ ఘటనకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
Bollywood actor Saif Ali Khan stabbed during robbery at home







































