ఇంట్రెస్టింగ్: రాజా సాబ్ గా ప్రభాస్
Prabhas as Raja Saabదర్శకుడు మారుతి.. ప్యాన్ ఇండియా స్టార్ ప్రభాస్ కలయికలో తెరకెక్కుతున్న చిత్రం ఇప్పటివరకు చడీ చప్పుడు లేదు, షూటింగ్ ఎప్పుడు మొదలయ్యింది, షూటింగ్ ఎంతవరకు వచ్చింది, అసలు ప్రభాస్ తో నటించే హీరోయిన్స్ ఎవరు అనే విషయంలో మారుతి గుట్టు చప్పుడు లేకుండా సైలెన్స్ ని మైంటైన్ చేసారు. కానీ ఈ ఏడాది స్టార్టింగ్ లోనే మారుతీ ప్రభాస్ తో చేస్తున్న మూవీపై ఒక్కసారిగా అంచనాలు క్రియేట్ చేస్తూ పొంగల్ ఫీస్ట్.. ప్రభాస్ ఫస్ట్ లుక్, టైటిల్ తో వస్తున్నామంటూ ఒక్కసారిగా అందరిలో ఆసక్తిని రేకెత్తించారు.
అనుకున్నట్టుగానే సంక్రాంతి స్పెషల్ గా సోమవారం జనవరి 14 న సూర్యుని రాకతో పాటుగా 7.08 నిమిషాలకి ప్రభాస్ అభిమానుల నడుమ భీమవరంలో ప్రభాస్-మారుతి మూవీ ఫస్ట్ లుక్ టైటిల్ తో సహా వదిలారు మేకర్స్. వింటేజ్ లుక్ లో ప్రభాస్ రాజా సాబ్ గా వచ్చేసారు.
మరి బాహుబలిగా, సాహోలో మాస్ ప్రభాస్ గా, రాధేశ్యామ్ లో కూల్ లుక్ లో, సలార్ లో మాసివ్ గా గా గంభీరంగా కనిపించిన ప్రభాస్ ఇప్పుడు రాజా సాబ్ గా ఫుల్ మాసీగా, ఎంటర్టన్ చేసేలా కనిపిస్తున్నారు. ఆ లుంగీ కట్టుతో వింటేజ్ ప్రభాస్ గుర్తుకు వస్తున్నారు. చాలారోజుల తర్వాత ప్రభాస్ ఓ కొత్త లుక్ లో ఫ్యామిలీ ఆడియన్స్ కి దగ్గరయ్యేలా మారుతి డిజైన్ చేసిన తీరుకు ప్రభాస్ అభిమానులు ఫిదా అవుతున్నారు.
సంక్రాంతి పండగ తో పాటుగా.. ప్రభాస్ అభిమానులు రాజా సాబ్ ఫస్ట్ లుక్ పోస్టర్ తో పండగ సంబరాలు షురూ చేసారు. ఇటు సోషల్ మీడియాలో రాజా సాబ్ ఫస్ట్ లుక్ ని వైరల్ చేస్తూ హంగామా మొదలు పెట్టేసారు.
Prabhas Raja Saab title and first look revealed







































