ఆంగ్ల హోమ్ >> తెలుగు వార్తలు >> Chiranjeevi Sensational Comments on AP govt

వాడిగా, వేడిగా వాల్తేరు వీరయ్య వ్యాఖ్యలు

Chiranjeevi Sensational Comments on AP govt

మెగాస్టార్ చిరంజీవి భోళా శంకర్ రిలీజ్ ప్రమోషన్స్ లో బిజీగా ఉండడమే కాదు.. ఆయన నటించిన వాల్తేర్ వీరయ్య మూవీ 200 రోజులు పూర్తి చేసుకోవడంతో ఆ సినిమా సక్సెస్ సెలెబ్రేషన్స్ లో ఉత్సాహంగా పాల్గొన్నారు. అయితే మెగాస్టార్ వాల్తేర్ వీరయ్య 200 డేస్ సెలెబ్రేషన్స్ లో ఏపీ ప్రభుత్వంపై వాడిగా, వేడిగా చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. 

ఈమధ్యన అంబటి రాంబాబు బ్రో మూవీ కలెక్షన్స్ పై చేసిన ట్వీట్స్ ని ఉద్దేశించి మెగాస్టార్ మాట్లాడుతూ.. ప్రభుత్వం, ప్రభుత్వ అధినేతలు, అధికారులు పెద్ద పెద్ద విషయాలపై దృష్టిపెట్టాలి. దానినుంచి మంచి ఫలితాలు రప్పించేలా పనిచేయాలి. ప్రత్యేక హోదా, లేకపోతే నీటి ప్రాజెక్టుల గురించి కానీ, లేదా రోడ్ల నిర్మాణాల గురించి కానీ, లేదా పేదవాళ్ల కడుపు నింపే పథకాలపై దృష్టిపెట్టాలి.. అంతేకాకుండా నిరుద్యోగులకు అవకాశాలు కల్పించడం గానీ, ఉపాధి అవకాశాలు గానీ, ఇతర అభివృద్ధి అంశాలపై దృష్టిపెడితే ప్రజలు, ప్రపంచం హర్షిస్తుంది. 

అలా కాకుండా పిచ్చుక మీద బ్రహ్మాస్త్రం మాదిరిగా సినిమా ఇండస్ట్రీపై పడితే ఎలా.. దయచేసి ఇలాంటి చర్యలు మానుకోవాలి అంటూ మెగాస్టార్ చిరంజీవి ఏపీ ప్రభుత్వంపై చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు తీవ్ర దుమారాన్ని రేపుతున్నాయి. తమ్ముడు పవన్ కళ్యాణ్ బ్రో పై అంబటి చేసిన రాద్ధాంతానికి మెగాస్టార్ ఇలా డైరెక్ట్ గానే కౌంటర్ వేశారు. 

Megastar Chiranjeevi Sensational Comments on AP Government

chiranjeevi