ప్రాజెక్ట్ K గ్లింప్స్ పై సింగీతం కామెంట్స్
The Glimpse Of Project K Is Out Of The Worldప్రాజెక్ట్ K సినిమా ప్రభాస్-దీపికా పదుకొనే-అమితాబచ్చన్ చెప్పుకోవడానికి గొప్పగా ఉంటుంది. రీసెంట్ గా కమల్ హాసన్ వచ్చి జాయిన్ అయ్యారు. ఇప్పుడిది చాలా పెద్ద ప్రాజెక్ట్ అయ్యిపోయింది అనుకుంటున్నాం కానీ బి హైండ్ ద స్క్రీన్ ప్రభాస్-నాగ్ అశ్విన్ వీళ్ళు పైకి కనిపించే పేర్లు అయితే.. పైకి కనిపించని పేరు సింగీతం శ్రీనివాసరావు. నాగ్ అశ్విన్ చాలా తెలివిగా ఏరి కోరి ఎంచుకుని తెచ్చుకుని పెట్టుకున్న దర్శకత్వపు మార్గదర్శకుడు సింగీతం శ్రీనివాస రావు .
మాయాబజార్ కి దర్శకత్వపు శాఖలో పని చేసిన వ్యక్తి భైరవ ద్వీపం, పుష్పక్, ఆదిత్య 369, విచిత్ర సోదరులు ఇలా ఎన్నో ప్రయోగాలు చేసిన ఉద్దండ దర్శకుడు ఆయన్ని తెచ్చి పెట్టుకోవడం వలన ఈ ప్రాజెక్ట్ పై క్రేజ్ మరింతగా పెరిగిపోయింది. కమల్ హాసన్ ఈ ప్రాజెక్ట్ లోకి రావడానికి ముఖ్యమైన కారణం కూడా సింగీతం శ్రీనివాసరావు అని తెలుస్తోంది. ఆయన కమల్ తో మాట్లాడి ఒప్పించి ఈ ప్రాజెక్ట్ లో భాగమయ్యేలా చేసారు. కమల్ తో పలు హిట్ ప్రాజెక్ట్స్ చెయ్యడంతో సింగీతం ప్రపోజల్ ని కమల్ వేంటనే యాక్సెప్ట్ చేసారని సమాచారం.
సింగీతం దిశా నిర్దేశకత్వంలో సలహాలు, సూచనల మేరకు ప్రాజెక్ట్ K తెరకెక్కుతుంది. ప్రాజెక్ట్ K కోసం నాగ్ అశ్విన్ కట్ చేసిన గ్లింప్స్ చూసి సింగీతం శ్రీనివాసరావు గారు నా 66 ఇయర్స్ సినిమా ఇండస్ట్రీ కెరీర్ లో ఇలాంటిది చూడలేదయ్యా.. ఇదో అద్భుతం అంతే.. అని చెప్పి ఎగ్జైట్ అవుతూ ప్రాజెక్ట్ K టీమ్ ని అప్రిషేట్ చేసారు. అది జులై 20న కామికన్ స్టేజ్ పై రివీల్ కాబోతుంది. ఎంత ఎక్స్ పెక్టేషన్స్ పెట్టుకున్నా అది మరింతగా పెరుగుతుంది తప్ప తగ్గడం లేదు.
Singeetam Gets Awestruck After watching The Glimpse of Project K







































