Advertisement
ఆంగ్ల హోమ్ >> తెలుగు వార్తలు >> Khushi Kapoor with a glamour show beyond her sister

అక్కని మించిన గ్లామర్ షోతో ఖుషి కపూర్

Khushi Kapoor with a glamour show beyond her sister

శ్రీదేవి కూతుళ్లు జాన్వీ కపూర్, ఖుషి కపూర్ లు మోడ్రెన్ గా కనిపిస్తారు. మొదటి నుండి గ్లామర్ పరంగానే హైలెట్ అవుతున్నారు. జాన్వీ కపూర్ సోషల్ మీడియాలో చేసే గ్లామర్ షో పదే పదే హైలెట్ అవుతుంది. కానీ ఖుషి కపూర్ అప్పుడప్పుడు మాత్రమే ఇలా కనిపిస్తుంది. కొద్ది రోజులుగా ఖుషి కపూర్ కూడా అందాల ఆరబోసే ప్రాసెస్ మొదలు పెట్టింది. జాన్వీ కపూర్ సారీ కట్టినా, మోడ్రెన్ డ్రెస్ వేసినా, జిమ్ వెర్ లో కనిపించినా అదిరిపోయే గ్లామర్ లుక్ లోనే కనిపిస్తుంది. 

ఇక ఖుషి కపూర్ అయితే ఈమధ్యన అక్కకి మించిన అందాలు చూపిస్తుంది. తాజాగా ముంబైలో జరిగిన నీతూ ముఖేష్ అంబానీ కల్చరల్ సెంటర్ ఓపెనింగ్ లో ఆమె కనిపించిన తీరుకి ఔరా అని అనిపించకమానదు. గోల్డ్ కలర్ షిమ్మరి డ్రెస్ లో ఎద అందాలతో రెచ్చిపోయింది. అసలు ఖుషిని అలా చూస్తే జాన్వి కపూర్ ఏం సరిపోతుంది నీ ముందు అంటారేమో. అంతలాంటి ఎక్స్ పోజింగ్ తో ఖుషి కపూర్ అందరి చూపు తనవైపే తిప్పుకుంది. 

ప్రస్తుతం సోషల్ మీడియాలో శ్రీదేవి కూతుళ్ళ అందాలను చర్చించుకునే పనిలో నెటిజెన్స్ ఉన్నారు. జాన్వీ కపూర్ రీసెంట్ గా తిరుమల శ్రీవారి దర్శనంలో పట్టుపరికిని, ఓణిలో ట్రెడిషనల్ గా బ్యూటిఫుల్ గా కనిపించింది.

Khushi Kapoor glamour show at NMACC opening

khushi kapoor