వీర సింహా రెడ్డి కథ లీకైందా?

Is this Veera Simha Reddy story

నటసింహం బాలకృష్ణ వీర సింహా రెడ్డి గా తన  ఉగ్రరూపం చూపించడానికి సిద్ధమవుతున్నాడు. దీపావళి సందర్భంగా చిత్ర నిర్మాతలు చిత్రం టైటిల్ ని విడుదల చేసి అభిమానులను ఆనందడోలికలలో ముంచెత్తారు. వీర సింహా రెడ్డి కి గోపీచంద్ మలినేని దర్శకత్వం వహిస్తున్నాడు. ఈ మధ్యనే బాలకృష్ణ పవర్ఫుల్ డైలాగులను చెప్పి అందరిని ఉత్తేజితుల్ని చేసాడు. ఈ చిత్రం వచ్చే సంవత్సరం సంక్రాంతికి విడుదల చేయనున్నారు.

ఇప్పుడు వీర సింహ రెడ్డి కథ లీకైంది అంటూ నెట్టింట వార్తలు దావానలనంలా వ్యాపిస్తున్నాయి. నెట్టింట సందడి చేస్తున్న కథ ప్రకారం, బాలకృష్ణ తండ్రి కొడుకుల పాత్రలని పోషిస్తున్నాడు. కొడుకైన బాలకృష్ణ విదేశాలలో ఒక బ్యాంకు లో మేనేజర్ గా పనిచేస్తుండగా, అతని తండ్రి (బాలకృష్ణ) రాయలసీమలో ఒక ఫ్యాక్షన్ లీడర్. వరలక్ష్మి శరత్ కుమార్ అతని చెల్లెలి పాత్రలో నటిస్తోంది. ఫ్యాక్షన్ గొడవలతో తండ్రిని అతని శత్రువులు (దునియా విజయ్) మరియు తదితరులు దారుణంగా హతమారుస్తే, పగతీర్చుకోడానికి ఇండియా వస్తాడు.

ఈ కథని వినగానే, బాలకృష్ణ అభిమానులు ఎప్పుడెప్పుడు బాలకృష్ణ ని వీర సింహా రెడ్డి గా తెరపై చూద్దామా అని ఉత్సాహంతో ఎదురుచూస్తున్నారు. అఖండ లో తన నట విశ్వరూపం చూపించిన బాలకృష్ణ, మళ్ళీ బాక్స్ ఆఫీస్ వద్ద సత్తా చూపి మాస్ లో తనకి ఎదురులేదని నిరూపించడానికి ఉర్రూతలూగుతున్నా

Veera Simha Reddy story leaked

veera simha reddy
balakrishna
veera simha reddy story